close

ప్ర‌త్యేక క‌థ‌నం

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

కాలు కదపకుండానే కావలసినవన్నీ సమకూరాలి.. ఇల్లు కదలకుండానే అవసరాలన్నీ తీరిపోవాలి.. బుద్ధికి పదునుపెట్టి ఇలాంటి కొత్త పద్ధతులు కనిపెడుతున్న మానవుడికి ఇప్పుడు అదే పెద్ద బలహీనతగా మారిపోయింది. బ్యాంకుకు వెళ్లకుండానే సొమ్ము మార్పిడి.. క్యూలో నిలబడకుండానే సినిమా, రైలు, బస్సు, విమానం టికెట్లు కొనుక్కునే వీలు.. బడికి వెళ్లకుండానే పిల్లల ఫీజు కట్టే అవకాశం.. దుకాణానికి వెళ్లకుండానే సకల వస్తువులనూ కొనుక్కునే సౌలభ్యం.. చివరకు పొయ్యి వెలిగించకుండా ఎలాంటి ఆహారాన్నయినా ఇంటికే తెప్పించుకునే సౌకర్యం.. ఇలా అన్ని అవసరాలకూ ఇప్పుడు ఆన్‌లైనే పరిష్కారమైంది. అదే ఇప్పుడు సైబర్‌ నేరస్థుల పాలిట వరమైంది.

ఆధునికత మనిషికి ఎంత ఆనందాన్ని సమకూరుస్తోందో అంతే అనర్థాన్నీ తెచ్చిపెడుతోంది. పడ్డ జీతం పడ్డట్లే మాయమవుతోంది. బ్యాంకులో దాచుకున్న సొమ్మంతా రెప్పపాటులో కరిగిపోతోంది. జాగ్రత్తగా దాచిపెట్టుకున్న వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్లో వేలానికి సిద్ధమవుతోంది.. వ్యక్తిగత చిత్రాల వంటివి బజారుకెక్కుతున్నాయి.. ఒకప్పుడు విలువైనదంటే డబ్బు, బంగారమే. ఇప్పుడు వాటికంటే వ్యక్తిగత సమాచారమే విలువైనదిగా మారింది. అందుకే మనుషులను కిడ్నాప్‌ చేయడం కంటే.. ఇళ్లు దోచుకోవడం కంటే వారి వివరాలు చోరీ చేయడమే లాభదాయకంగా మారింది నేరగాళ్లకు. మొత్తం మీద అందరి జీవితాల్లో భాగమైపోయిన డిజిటల్‌ ప్రపంచం ఇప్పుడు చాలామందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సైబర్‌ నేరాలు సాధారణ నేరాలను మించిపోతున్నాయి. చోరీలకు అర్థాలను మార్చేస్తున్నాయి. ఒకప్పుడు దొంగలు దారికాచి దోపిడీలకు పాల్పడేవారు.. తర్వాత ఇళ్లకు కన్నాలేసేవారు.. ఇప్పుడు అంతా ఆన్‌లైనే. దొంగలు కూడా కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు.

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు
 

రోజుకు 24,000 

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు
డేటా చౌర్యం కోసమే రూపొందించిన 24 వేల మొబైల్‌ యాప్‌లను ప్రతిరోజూ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు మూసివేస్తున్నాయి.

మన దేశంలో 

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

2016 అక్టోబరులో వివిధ బ్యాంకుల ద్వారా 3.2 మిలియన్ల భారతీయ ఖాతాదారుల డెబిట్‌ కార్డుల సమాచారం చోరీ అయింది.

గత ఏడాది తమిళనాడులోని సిటీ యూనియన్‌ బ్యాంకు నెట్‌వర్క్‌పై దాడి చేసి 2 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టారు. 

2018 అక్టోబరులో ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మారిషస్‌లో సైబర్‌దాడుల ద్వారా రూ.143 కోట్లు దోచుకున్నారు.

2018 ఆగస్టు 11, 13 తేదీల్లో పుణెలోని కాస్మస్‌ బ్యాంక్‌ ఏటీఎం నెట్‌వర్క్‌లోకి చొచ్చుకెళ్లిన సైబర్‌ నేరగాళ్లు రూ. 94 కోట్లు దోచుకున్నారు.

మైక్రోసాఫ్ట్‌ సంస్థ అంచనా ప్రకారం భారతదేశంలో మధ్యతరగతి వ్యాపార సంస్థ అయితే సైబర్‌ నేరాల వల్ల ఏటా 10.3 మిలియన్‌ డాలర్లు, చిన్నపాటి సంస్థ అయితే 11 వేల డాలర్ల చొప్పున నష్టపోతున్నాయి.

 

ఏడాదిలో 53,000 సైబర్‌ దాడులు

* కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సెర్ట్‌) అంచనా ప్రకారం 2018లో మనదేశంలో 53,000 సైబర్‌ దాడులు జరిగాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 10శాతం ఎక్కువ.

* వీటిలో 25 శాతం అమెరికా నుంచి, 13 శాతం పాకిస్థాన్‌ నుంచి, 9 శాతం రష్యా నుంచి.

* మనదేశంలో జరుగుతున్న సైబర్‌ దాడుల విషయంలో బాధితులు ఫిర్యాదు చేస్తున్నవి 5 శాతం మాత్రమే.

* ప్రతి 39 సెక్లను ఒక హ్యాకింగ్‌ నమోదవుతోంది.

* ప్రపంచంలో 38 శాతం సంస్థలకు మాత్రమే సైబర్‌ దాడులను తట్టుకోగలిగే సామర్థ్యం ఉంది.

95% 
సైబర్‌ నేరాలకు కారణం మానవపరమైన తప్పిదాలే.
21 స్థానం 
సైబర్‌దాడుల నుంచి రక్షణ ఉత్పత్తులను వెలువరించే ఎఫ్‌-సెక్యూర్‌ సంస్థ అంచనా ప్రకారం హ్యాకర్లు ఎక్కువగా దాడులకు పాల్పడే దేశాల్లో మన స్థానమిది.

మన కంప్యూటర్లో విదేశీ గూఢచారి కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

సామాజిక మాధ్యమంలో అందరికీ సుపరిచితమైన యాహూకు చెందిన 3 బిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు చోరీ చేశారు. దానిని వారు రకరకాలుగా వాడుకునే వీలుంది. ఉదాహరణకు మన మిత్రుడి సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కితే అతని పేరుతో మనకు ఒక మెయిల్‌ వస్తుంది. తెలిసిన వాడే కదా అని దాన్ని తెరిస్తే మన కంప్యూటర్లో గూఢచారి సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌) తిష్ఠవేస్తుంది. అప్పటి నుంచి మన కంప్యూటర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

స్నేహితులను కోరుకునే వారి కోసం ఏర్పాటు చేసిన ఫైండ్‌ ఫ్రెండ్స్‌ అనే వెబ్‌సైట్‌ నుంచి 312 మిలియన్ల మంది ఖాతాదారుల అత్యంత వ్యక్తిగత సమాచారం చౌర్యమైంది.
వన్నా క్రై వంటి మాల్‌వేర్‌ ద్వారా కంప్యూటర్‌ను స్వాధీనపరచుకొని డిజిటల్‌ రూపంలో డబ్బు డిమాండు చేసే క్రిప్టో జాకింగ్‌ ఉదంతాలు 2018లో అంతకు ముందు ఏడాది కంటే 8,500 రెట్లు పెరిగాయి.

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు   * 3 కోట్లమంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం చోరుల పాలైంది.

ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించే ఈ-బే సంస్థ ద్వారా లావాదేవీలు నిర్వహించే 145 మిలియన్ల మంది ఖాతాదారుల వివరాలు చోరీ అయ్యాయి. ఈ సమాచారాన్ని వారు ఎలా వాడుకున్నారన్నది తెలియలేదు.కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని 4 లక్షల కంప్యూటర్లలో వన్నా క్రై తిష్ఠవేసి ఏడిపించింది. దీనివల్ల కలిగిన నష్టం 4 బిలియన్‌ డాలర్లు.

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

ఉబెర్‌ సంస్థ నుంచి ఆరు లక్షలమంది డ్రైవర్ల లైసెన్సు నంబర్లు సహా వ్యక్తిగత సమాచారమంతా నేరగాళ్ల పాలైంది. ఆ సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ఉబెర్‌ సంస్థ నేరస్థులకు లక్ష డాలర్లు చెల్లించినట్లు సమాచారం.

సైబర్‌ నేరగాళ్లు మారియెట్‌ ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ గ్రూప్‌ నుంచి 500 మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారు. ఇందులో వంద మిలియన్లమంది ఖాతాదారుల క్రెడిట్‌ కార్డులు, వాటి వివరాలు చోరీ అయ్యాయి. ఆ వివరాల ద్వారా నకిలీ కార్డులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖాతాదారుల పాస్‌పోర్టు నంబర్లు, ఇతర వివరాలను కొల్లగొట్టారు.

కాలు కదపకుండానే కన్నమేస్తున్నారు

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.