close

ప్ర‌త్యేక క‌థ‌నం

రెండో బిడ్డ వద్దంటున్న యువత

 చైనాకు కొత్త చిక్కులు

 పెరుగుతున్న వృద్ధులు.. తగ్గుతున్న యువత
తగ్గిన శిశు జననాలు - మందగించిన ఆర్థిక గమనం

డ్రాగన్‌లో ఆందోళన

రెండో బిడ్డ వద్దంటున్న యువత

బీజింగ్‌: ఓ పక్క నలువైపులకూ పాకాలనే కాంక్షతో విస్తరిస్తున్న చైనాకు.. సొంతింటిలో కొత్త చిక్కులు వేధిస్తున్నాయి. శ్రమ చేసే వయసుండే వారు తగ్గిపోతుండటం, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో శిశు జననాల్ని పెంచేందుకు చైనా తీసుకొచ్చిన రెండో సంతానం విధానం సైతం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దశాబ్దాల పాటు అమలు చేసిన ఏక సంతానం విధానాన్ని రద్దు చేస్తూ 2016లో చైనా ఇద్దరు సంతానానికి అనుమతినిచ్చింది. ఈ విధానం సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గత ఏడాది శిశు జననాలు 20 లక్షలు తగ్గినట్లు సోమవారం వెల్లడించిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తగ్గిన శిశు జనన రేట్లు, మందగించిన ఆర్థిక వ్యవస్థ చైనాకు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధుల జనాభా స్థిరంగా పెరుగుతుండటంతో ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరగడం, శ్రామికుల కొరత ఏర్పడటం ఈ ఆందోళనకు కారణమవుతోంది.


ఎందుకిలా.. 
*  2018లో చైనాలో 1.5 కోట్లకు పైగా శిశువులు జన్మించారు. 2017తో పోలిస్తే 20 లక్షలు తక్కువ. ప్రతి లక్ష మందికి జననాల రేటు 2017లో 1,243 ఉండగా, 2,018లో 1094కు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 
139 కోట్లను దాటిన చైనా జనాభాలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 24.9 కోట్లకు మించిపోయింది. మొత్తం జనాభాలో 17.9 శాతం. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు శ్రమ చేసే సామర్థ్యం ఉన్న వారి సంఖ్య 89.7 కోట్లు. మొత్తం జనాభాలో 64.3 శాతం. 
సంతాన సామర్థ్య వయసులో ఉండే మహిళల సంఖ్య వేగంగా తగ్గిపోవడం, అధిక సంతానం విషయంలో జనానికి ఆసక్తి లేకపోవడం కారణాలని చైనా నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
20 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు మహిళల సంఖ్య వచ్చే దశాబ్దంలో 30.9 లక్షలకు తగ్గిపోతుందని భావిస్తున్నాట్లు జనాభా నిపుణులు హె యఫు పేర్కొన్నారు. సంతాన వృద్ధి చర్యలను ప్రోత్సహించకపోతే చైనా జనాభా భవిష్యత్తులో గణనీయంగా తగ్గిపోతుందన్నారు. 
ప్రజలు ఎక్కువమంది సంతానం పొందేలా, కుటుంబ నియంత్రణ విధానాల్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా చైనా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.