
ప్రత్యేక కథనం
నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కీలక బాధ్యతల్లో 11వ వ్యక్తి
నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి మరో వ్యక్తి భారత రాజకీయ రంగంలోకి అడుగిడారు. ఈ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 11వ వ్యక్తిగా నెహ్రూ మునిమనవరాలు....ఇందిరాగాంధీ మనవరాలు...రాజీవ్‌గాంధీ కుమార్తె....రాహుల్‌గాంధీ చెల్లెలు అయిన ప్రియాంకాగాంధీ ఇప్పుడు నేరుగా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా ప్రియాంక బుధవారం నియమితులయ్యారు. కాంగ్రెస్‌పార్టీలో అధికారికంగా ఆమె ఓ పదవిని పొందడం ఇదే ప్రథమం. అంతకుముందామె అమ్మ సోనియా, సోదరుడు రాహుల్‌గాంధీలు నిర్వహించిన ఎన్నో బహిరంగసభల్లో పాల్గొన్నప్పటికీ....పార్టీ పరంగా అధికారికంగా బాధ్యతలను చేపట్టడం ఇదే మొదటిసారి.
* భారత రాజకీయాలతో నెహ్రూ-గాంధీ కుటుంబం పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. బ్రిటిష్పాలకులతో పోరులో మోతీలాల్నెహ్రూ పాల్గొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే ఆయన కాంగ్రెస్‌పార్టీలో సభ్యులు. తొలుత 1919-1920....ఆ తర్వాత 1928-29 సంవత్సరాల్లో మోతీలాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు.
* ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ 1912లో భారత రాజకీయాల్లోకి అడుగిడారు. 1923లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానకార్యదర్శిగా కాంగ్రెస్‌పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఒకరిగా ఎదిగారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించగానే భారతావనికి తొలిప్రధాని అయ్యారు.
* జవహర్లాల్ కుమార్తె ఇందిర ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే రాజకీయరంగప్రవేశం చేశారు. 1958లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.
* 1964లో తండ్రి జవహర్లాల్ మరణానంతరం కూడా ఆమె రాజకీయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించారు. 1966లో భారత ప్రధాని అయ్యారు. ఎమర్జెన్సీ విధింపుతో విమర్శలకు గురయ్యారు. 1977లో పరాజయం పాలైనప్పటికీ....1980లో తిరిగి భారత ప్రధాని పదవిని అధిష్టించారు. అధికారంలో ఉండగానే 1984లో హత్యకు గురయ్యారు.
* అమ్మ ఇందిర అధికారంలో ఉండగా ఒక్కవెలుగువెలిగి...కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపడతారనుకున్న ఆమె కుమారుడు 1980లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు.
* ఇక, 1984లో ఇందిర హత్యానంతరం రెండో కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
* 1989లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. రెండేళ్ల తర్వాత అంటే...1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.
* రాజీవ్ మరణంతో....1997లో అయిష్టంగానే ఆయన భార్య సోనియాగాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంగ్రెస్‌పార్టీ సభ్యురాలయ్యారు. 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
* గత ఏడాది డిసెంబరులో రాజీవ్-సోనియాల కుమారుడు రాహుల్‌గాంధీ పార్టీ సారథ్యబాధ్యతలు స్వీకరించారు.
* తాజాగా ఈ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగిడారు.
నీ తోడునై.. నీడనై ఉంటా.. ప్రియాంకకు అభినందనలు. అత్యుత్తమ సేవలందించు. నీ జీవితంలోని ప్రతిదశలోనూ నేను తోడుంటాను. - రాబర్ట్ వాద్రా |
మరిన్ని

దేవతార్చన
- 20న వేటూరి విగ్రహావిష్కరణ
- భైంసాలో విషాదం.. 500 మందికి అస్వస్థత
- ఆశ్చర్యపరుస్తున్న వింత చేప
- డబ్బుపోయిందంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోదన
- భారీగా ఎర్రచందనం స్వాధీనం
- శ్రీశైలానికి.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెస్తాం
- 15 అడుగుల బొంగు చికెన్ తయారీ
- చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించం: కాగ్నిజెంట్
- ఉపరాష్ట్రపతి రాకకు రైల్వేస్టేషన్ ముస్తాబు
- జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 10మంది మృతి