close

ప్ర‌త్యేక క‌థ‌నం

గెలుపుపొందు వరకూ అలుపు లేదు మనకు

పది విద్యార్థులకు పునశ్చరణే కీలకం
విద్యార్థులతో మరోసారి పాఠ్యాంశాలు వల్లె వేయిస్తున్న ఉపాధ్యాయులు

పాఠశాల విద్యలో పదోతరగతి అత్యంత కీలకం. విద్యార్థులు మొట్టమొదటిసారిగా రాసే పబ్లిక్‌ పరీక్షలు కావడంతో వారి జీవితంలో వాటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ పరీక్షలకు ఇంకా 52 రోజులే సమయం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం పునశ్చరణ తరగతులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో డిసెంబరు 15నుంచి ప్రారంభం కాగా.. ప్రైవేటులో నవంబరు నెలాఖరు నుంచే పునశ్చరణ మొదలైంది.

అదనపు తరగతులు..

దోతరగతి ఫలితాలపై విద్యాశాఖతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించడంతో ఉపాధ్యాయులు ఉదయం 8గంటల నుంచి 9.10-9.30గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పది ఫలితాల్లో జిల్లాల మధ్య పోటీ నెలకొన్నందున ఎవరికి వారు పునశ్చరణకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి 22వ తేదీ వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనుండగా.. మార్చి 18నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ప్రత్యేక మెటీరియల్‌ పంపిణీ..

జిల్లాలవారీగా విద్యార్థులకు బిట్లు, చిన్న మార్కుల ప్రశ్నల కోసం ప్రత్యేకంగా మెటీరియల్‌ను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. దీనికి జిల్లాపరిషత్తులు, కలెక్టర్లు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కొన్ని జిల్లాల్లో ప్రతి సబ్జెక్టుపై వారాంతపు పరీక్షలు, కొన్నిచోట్ల ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తరగతులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పునశ్చరణ చేయించడంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కృష్ణా జిల్లాలోని నిడమానురుకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బట్టు సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయం తొలగించేందుకు చిన్న పరీక్షలు, పాత ప్రశ్నపత్రాలపై సాధన చేయిస్తున్నామన్నారు.

వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా..

హజంగా విద్యార్థులు కఠినంగా భావించే గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని, వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు మూడు కేటగిరీలుగా విభజించి పునశ్చరణ చేయిస్తున్నామని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఎన్‌జీఏ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రావి వెంకటరమణ వెల్లడించారు. చదువులో వెనుకబడ్డ వారు ఉత్తీర్ణత సాధించేందుకు బహుళైచ్చిక, పొట్టి సమాధానాల ప్రశ్నలు, గణితంలో గ్రాఫ్స్‌, సామాన్యశాస్త్రంలో బొమ్మలు, సాంఘిక శాస్త్రంలో పటాలపై దృష్టి సారించి బోధిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు

దువులో విద్యార్థుల పరిస్థితిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు పురపాలక పాఠశాలల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తున్నామని విజయవాడకు చెందిన జీడీఈటీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వి.రవికుమార్‌ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ తరఫున అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు.

ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.