Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అడవులకు డ్రోన్ల రక్షణ

గగనతలం నుంచి వేటగాళ్లపై నిఘా 
బఫర్‌ జోన్లలో కెమెరా ట్రాప్‌లు 
తెలంగాణ అటవీ శాఖ యోచన 
ఈనాడు - హైదరాబాద్‌

అటవీ నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంపై అటవీశాఖ దృష్టిపెట్టింది. నేరాలు అధికంగా జరిగే టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో డ్రోన్లతో ఆకాశం నుంచి నిఘా పెట్టాలని యోచిస్తోంది. దీంతోపాటు అడవుల్లో కెమెరా ట్రాప్‌లను పెద్దఎత్తున అమర్చేందుకు సిద్ధమవుతోంది. తద్వారా చెట్లను నరుకుతున్న స్మగ్లర్లతోపాటు జంతువులను చంపుతున్న వేటగాళ్లలో భయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో వేటను అరికట్టాల్సిందేనని హైకోర్టు గురువారం ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలో కవ్వాల్‌, అమ్రాబాద్‌ రెండు టైగర్‌ రిజర్వులున్నాయి. ఇటీవల జంతువులను చంపిన ఘటనలు కవ్వాల్‌లో అధికంగా జరిగిన నేపథ్యంలో ఈ రెండుచోట్ల వేట, కలప స్మగ్లింగ్‌ అరికట్టే ప్రణాళికలు రూపొందించి, కార్యాచరణ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ఝా అధికారులతో ప్రాథమికంగా జరిపిన చర్చలో పలు సూచనలు వచ్చాయి.

కవ్వాల్‌లో 237 గ్రామాలు 
మధ్యప్రదేశ్‌లోని ‘కన్హ’ టైగర్‌ రిజర్వులో వేటగాళ్లపై నిఘా కోసం డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. పెద్దపులుల సంరక్షణపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కన్హలో డ్రోన్ల వాడకాన్ని పిటిషనర్‌ ప్రస్తావించారు. దీంతో కవ్వాల్‌లో డ్రోన్ల వాడకం సాధ్యాసాధ్యాలపై అధికారులతో పీసీసీఎఫ్‌ చర్చించారు. ‘‘కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ప్రధాన అటవీ ప్రాంతం (కోర్‌ ఏరియా)లో 37, బఫర్‌ ఏరియాలో 200 గ్రామాలున్నాయి. దాదాపు 2.50 లక్షల మంది ప్రజలున్నారు. వీరూ అడవిలో తిరుగుతుంటారు. డ్రోన్ల ఫొటోలు, వీడియోలు వచ్చినా వాళ్లు వేటగాళ్లా? స్థానికులా? అనేది ఎలా గుర్తించగమలమనే దానిపై సందిగ్ధత వ్యక్తమైంది. అయితే డ్రోన్లు తిరిగితే బయటి నుంచి వచ్చే వేటగాళ్లు, స్మగ్లర్లతోపాటు అటవీభూముల ఆక్రమణదారులు వాటిని చూసి భయపడతారు’’ అని ఓ నిపుణుడు సూచించారు. డ్రోన్ల నుంచి వచ్చే శబ్దాలతో జంతువులు ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో శబ్దం రాని ఆధునిక డ్రోన్లనే వాడితేనే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోసారి చర్చించి తుదినిర్ణయం తీసుకోవాలనుకున్నారు.

2 చ.కిమీకి ఒక కెమెరా 
కవ్వాల్‌ కోర్‌ ఏరియాలో జంతువుల కదలికలు తెలుసుకునేందుకు రెండు చదరపు కిలోమీటరుకు ఒక కెమెరా ఉన్నట్లు అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. బఫర్‌ ఏరియాలో కెమెరా ట్రాప్‌లు లేవని, అక్కడా కెమెరాలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ తాజాగా నిర్ణయానికి వచ్చింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.