close

ప్ర‌త్యేక క‌థ‌నం

బరువు తగ్గనున్న చదువు! 

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళికలో కోతకు కసరత్తు 
వచ్చే విద్యా సంవత్సరానికి 15 శాతం వరకు తగ్గింపు 
సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఊరట 
ఈనాడు - హైదరాబాద్‌

డాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టడమనే సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న పాఠ్య ప్రణాళిక(సిలబస్‌)లో 50 శాతం దాకా కుదించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏటా కొంత వరకు సిలబస్‌కు కోత పెట్టనున్నారు. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరానికి(2019-20) 10-15 శాతం వరకు భారం తగ్గనుంది. ఇది దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది విద్యార్థులకు ఊరట కలిగించనుంది. 
ప్రస్తుతం కేవలం పుస్తకాలే ప్రపంచంగా విద్యార్థులు ఉంటున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ భావిస్తోంది. వ్యాయామం, నైతిక విద్య, జీవన నైపుణ్యాలు, ప్రయోగపూర్వక విద్య లేకుండా పోయిందని.. పిల్లలకు సంపూర్ణ విద్య(హోలిస్టిక్‌ ఎడ్యుకేషన్‌) అందించాలంటే వాటిని దైనందన కాలపట్టికలో చేర్చాలని అనుకుంటున్నారు. అది జరగాలంటే ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దశలవారీగా 2021-22 విద్యా సంవత్సరం నాటికి 50 శాతం సిలబస్‌ను తగ్గించాలన్నది లక్ష్యం. 
ఎన్‌సీఈఆర్‌టీ చర్యలు.. 
సీబీఎస్‌ఈ అనుబంధంగా నడిచే పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన పుస్తకాలనే వినియోగిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డు సైతం ఇదే సిలబస్‌ను పాటిస్తుంది. సిలబస్‌ తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నందున ఆ దిశగా ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు చేస్తోంది. సైన్స్‌, భాషలు, గణితంతో పోల్చుకుంటే సాంఘికశాస్త్రంలో ఎక్కువగా భారం తగ్గనుంది. మరో వైపు 11, 12 తరగతుల్లో సిలబస్‌ తగ్గించాల్సిన అవసరం లేదని ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయించింది. ఏటేటా విద్యామండలి ముద్రించిన పుస్తకాల వాడకం సైతం భారీగా పెరుగుతోంది. 2017లో 2 కోట్ల పుస్తకాలు, 2018లో 6 కోట్ల పుస్తకాలు విక్రయించారు. వచ్చే ఏడాదికి వాటి సంఖ్య 8 కోట్లకు పెరగనుందని కేంద్రం అంచనా. మరోవైపు అసలు పాఠ్య పుస్తకాలు ఎలా రూపొందించాలి? ప్రాతిపదిక ఏమిటి? ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో సూచిస్తూ పూర్తిస్థాయి మార్గదర్శకాలు తయారీకి జాతీయ మండలి శ్రీకారం చుట్టింది. తెలంగాణ నుంచి విశ్రాంత ఆచార్యుడు ఉపేందర్‌రెడ్డిని సైతం ఆహ్వానించి ఇటీవల దిల్లీలో ఎన్‌సీఈఆర్‌టీ ఓ కార్యశాల నిర్వహించింది. ఆ అంశాలను ఆయా రాష్ట్రాల విద్యాపరిశోధన, శిక్షణ మండళ్లకు పంపించనున్నారు.

శాస్త్రీయంగా చేస్తున్నారు

సిలబస్‌ తగ్గించడమంటే పుటలను కుదించడం కాదు. పునరావృతమైన అంశాలను, ప్రస్తుత కాలానికి అవసరం లేని వాటిని తొలగించాలని ఎన్‌సీఈఆర్‌టీ పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. ఇది శాస్త్రీయంగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తానికి విద్యార్థులపై భారం, ఒత్తిడి తగ్గించాలన్నదే లక్ష్యం. సిలబస్‌ తగ్గింపుపై ఆన్‌లైన్‌ ద్వారా లక్ష మంది అభిప్రాయాలు తీసుకున్నాం. 

- డాక్టర్‌ మురళీ మనోహర్‌, ఎస్‌సీఈఆర్‌టీ సభ్యుడు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.