close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాయా జగతి.. మత్తు సోపతి!

దేశంలో 16 కోట్ల మందికి మద్యం అలవాటు
మాదక ద్రవ్యాల వినియోగమూ ఎక్కువే
ఎయిమ్స్‌, ఎన్డీడీటీసీ సర్వేలో వెల్లడి
ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌

మద్యం ఇచ్చే కిక్కు సరిపోని మత్తు ప్రియులు మరింత హానికారకమైన మాదక ద్రవ్యాలనూ ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఇతర మత్తు పదార్థాలనూ తీసుకుంటున్నారు. 1.18 కోట్ల మంది కొన్ని రకాల ఔషధాలను మత్తు కోసం వినియోగిస్తున్నారు. దేశంలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగంపై అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌), నేషనల్‌ డ్రగ్‌ డిపెన్‌డెన్స్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (ఎన్డీడీటీసీ) నిర్వహించిన సర్వే నివేదికను కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది. విస్మయం కలిగించే పలు అంశాలు ఇందులో వెలుగుచూశాయి.

186 జిల్లాల్లో...
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 186 జిల్లాల్లో 2,00,111 కుటుంబాలపై సర్వే చేశారు. 10 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 4,73,569 మంది నుంచి వివరాలు సేకరించారు. ఈ లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల మందికి మద్యం అలవాటు ఉన్నట్లు అంచనా వేశారు. వీరిలో 2.9 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారు. మరో 5.7 కోట్ల మంది ఈ అలవాట్ల కారణంగా వివిధ రకాల రుగ్మతలతో సతమతమవుతున్నారు. మద్యాన్ని ఎక్కువ శాతం మంది వినియోగిస్తోన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ (35.6 శాతం) ప్రథమస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో త్రిపుర (34.7 శాతం), పంజాబ్‌ (28.5), అరుణాచల్‌ప్రదేశ్‌ (28), గోవా (26.4 శాతం) ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ (16.8 శాతం) 15వ, ఏపీ (13.7శాతం) 20వ స్థానంలో ఉన్నాయి.

అందని చికిత్స..
మద్యం, ఇతర మాదకద్రవ్యాల మత్తు బారి నుంచి బయటపడాలనుకునే వారికి సరైన చికిత్స లభించడం లేదు. మద్యానికి బానిసలైన 38 మందిలో ఒకరు, మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డ 20 మందిలో ఒకరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మత్తును వదిలించుకోవాలని ప్రయత్నించి ఎలాంటి చికిత్స దొరకని వారు 75 శాతం మంది ఉన్నట్లు సర్వే తేల్చడం గమనార్హం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.