close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ మహిళలు స్వతంత్రులు

పార్టీలతో సంబంధం లేకుండా గెలుపు 
పాలనలోనూ సత్తా చాటిన వనితలు

రాజకీయ రంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని పార్టీలు ఊదరగొడుతున్నాయి. వనితలకు టికెట్‌ ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని బాకా ఊదుతున్నాయి. తీరా ఎన్నికలు సమీపించి టికెట్లను కేటాయించే సమయానికి ముఖం చాటేస్తున్నాయి. రాజకీయాల్లో మహిళలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా లోక్‌సభ బరిలో దిగారు. వివిధ పార్టీల అభ్యర్థులను ఎదుర్కొని ‘స్వతంత్ర’ మహిళా ఎంపీలుగా పేరుపొందారు.పాలనలో నూ కీలకపాత్ర పోషించి సత్తా చాటారు. స్వతంత్ర ఎంపీలుగా గెలుపొందిన మహిళలు వీరే..

అన్ని మస్కరేన్‌ కుమారి  

కేరళలోని తిరువనంతపురానికి చెందిన అన్ని మస్కరేన్‌ స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

మైత్రేయ బోస్‌  

బిహర్‌లోని గిరిధ్‌ జిల్లాలో అక్టోబరు 7, 1905లో మైత్రేయ బోస్‌ జన్మించారు. నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో(1967-70)  డార్జిలింగ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.

కృష్ణకుమారి రాజ్‌మాతా 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన కృష్ణకుమారి రాజ్‌మాతాదీ రాజవంశీయుల కుటుంబం.  జోధ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె విజయకేతనం ఎగురవేశారు.

రాజ్‌మాతా కమలేందు షా  

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్‌వాలా జిల్లాకు చెందిన రాజ్మాతా కమలేందు షా ఓ సామాజిక కార్యకర్త. ఈ గుర్తింపుతోనే ఆమె.. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో (1952-57)స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

విజయ రాజే 
మధ్యప్రదేశ్‌లో 1919లో జన్మించిన విజయరాజేజనతాపార్టీ తరఫున మొదటి రాజ్యసభ సభ్యురాలిగా 1952 నుంచి 1957 వరకు ప్రాతినిధ్యం వహించారు ఆ తరవాత బిహార్‌లోని ఛాత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1957, 1962 పార్లమెంటు ఎన్నికల్లో జనతాదళ్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో 1967లో ఛాత్ర నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.

మేనకాగాంధీ  

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి మేనకాగాంధీ 9, 11వ లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరవాత పార్టీ టికెట్‌ లభించకపోవడంతో 1998, 1999లలో నిర్వహించిన 12, 13వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.


పుతుల్‌కుమారి  
బిహార్‌కు చెందిన పుతుల్‌కుమారి సామాజిక కార్యకర్త. బిహార్‌లోని బంక లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.