Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నానీ పంతమా.. దేవినేని సొంతమా

ఢీ అంటే ఢీ
కంచుకోట గుడివాడలో తిరిగి పాగాకు తెదేపా ప్రయోగాలు
బరిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌
మరోసారి విజయంపై ధీమాతో కొడాలి
ఈనాడు - అమరావతి

గుడివాడలో గెలుపు రెండు వర్గాలకు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. వ్యూహప్రతివ్యూహాలతో నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని తెదేపా ఇక్కడ రంగంలోకి దించింది. సినీ నిర్మాత, వైకాపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇక్కడ నాలుగో సారి బరిలోకి దిగుతున్నారు. 2004, 2009లో నాని తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పార్టీ మారి 2014లో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు.

ఇదీ చరిత్ర
తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో (రెండు ఉప ఎన్నికలు సహా) 8 పర్యాయాలు ఈ పార్టీనే విజయదుందుభి మోగించింది. 1989లో కాంగ్రెస్‌, 2014లో వైకాపా విజయం సాధించాయి. ఎన్టీ రామారావు ఇక్కడి నుంచి 1983, 1985లో పోటీ చేసి గెలుపొందారు. 1985లో హిందూపురం, నల్గొండల నుంచీ గెలవడంతో.. గుడివాడ స్థానానికి రాజీనామా చేశారు. 1985 ఉప ఎన్నిక, 1994 సాధారణ ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999లో రావి హరగోపాల్‌, 2000 ఉప ఎన్నికల్లో తెదేపా తరఫున రావి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.


గుడివాడలో మరోసారి నెగ్గి విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తా

వైకాపా బలాలు..
* నియోజకవర్గంలో కొన్ని వర్గాల అండ
* నవరత్నాలపై ప్రచారం
* యువత ప్రతినిధిగా కొడాలి నాని ఫోకస్‌
* ఎన్నికల వ్యూహాల్లో దిట్ట

బలహీనతలు
* హైదరాబాద్‌లో నివాసం, నాయకులకు సెల్‌ఫోన్‌లోనూ అందుబాటులో ఉండకపోవడం
* నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడం


పార్టీకి కంచుకోట లాంటి ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి గెలుచుకుంటా

తెదేపా బలాలు..
* పటిష్ఠమైన పార్టీ యంత్రాంగం
* నియోజకవర్గ నేతలు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, యలమర్తి వెంకటేశ్వరరావు ఐక్యంగా పనిచేస్తుండడం
* ప్రభుత్వ సంక్షేమ పథకాలు
* పట్టణ గృహనిర్మాణ పథకం, పింఛనుదారులు, రైతుల మద్దతు

బలహీనతలు..
* బయటి వ్యక్తికి టికెట్‌ ఇచ్చారనే ప్రచారం
* ఎన్నికల బరిలో తొలిసారి


జనాభా: 2,45,888
ఓటర్లు: 1,99,423
మహిళలు: 1,03,171
పురుషులు: 96,243


హోరాహోరీ..

ప్రస్తుతం తెదేపా, వైకాపా మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. యువనేత దేవినేని అవినాష్‌కు తెదేపా టికెట్‌ ఇవ్వడం ప్రయోగంగా భావిస్తున్నారు. స్థానికులను ఒక్క తాటిపైకి తెచ్చి సమష్టి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నాలుగోసారి విజయం మీద కొడాలి నాని విశ్వాసంతో ఉన్నారు. నియోజకవర్గంలో గుడివాడ పురపాలక సంఘం ఛైర్మన్‌ సహా 12 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. గుడివాడ, నందివాడ మండలాల్లో వైకాపా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఉన్నారు. గుడ్లవల్లేరు మండలం తెదేపా చేతిలో ఉంది.

* నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.