close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘ట్విట’ర్‌ కొంచెం..  కూత ఘనం

సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రచారం
ఓటర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త వ్యూహం
అభ్యర్ధుల నూతన ఒరవడి
ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుతం తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు ప్రత్యక్ష ప్రచారంతో పాటు, సామాజిక మాధ్యమాలే వేదికగా పరోక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఖాతాల ద్వారా ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. అభ్యర్థులు వీటి ద్వారా ప్రతి రోజూ సమాచారాన్ని, తమ అభిప్రాయాలు, సమస్యల పరిష్కారం, ప్రజాసంక్షేమం కోసం తీసుకొనే చర్యలను ఓటర్లకు వివరిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తెరాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు తమ ఖాతాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పేజీలు, యూట్యూబ్‌లో ప్రత్యేక ఛానెళ్లు సృష్టించుకుంటున్నారు. ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటున్నారు. ప్రచార వీడియోలు, ఫొటోలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తూ, ఆ యాత్రలపై అనుచరుల నుంచి వస్తున్న అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుని తదుపరి ప్రచారంలో అస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు.

ఓవైసీకి 25 లక్షల మంది

ఎంఐఎం అధినేత, ఆ పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీకి ఫేస్‌బుక్‌లో దాదాపు 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లోనూ ఆయన చురుగ్గా ఉంటూ 4.95 లక్షల మందితో తన అభిప్రాయాలను తరచూ పంచుకుంటూ పలు సమస్యలపై స్పందిస్తున్నారు.

తెరాస అభ్యర్థులు..

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెరాస ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కల్వకుంట్ల కవితను ట్విటర్‌ ఖాతాలో 7.82 లక్షల మంది అనుసరిస్తున్నారు. తెలంగాణలో భారీ సంఖ్యలో అభిమానులున్న మహిళా నాయకురాలు కవిత అనే చెప్పొచ్చు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న పాదయాత్ర, సమావేశ వివరాలను ట్వీట్‌ చేస్తున్నారు. ఇందులో వచ్చే సలహాలు, సూచనలు, విమర్శలను తరచూ పరిశీలిస్తున్న కవిత మరుసటి రోజటి కార్యక్రమాలను విమర్శలకు తావులేకుండా సమర్థవంతంగా రూపొందించుకుంటున్నారు.

ట్విటర్‌లో అభ్యర్థులను అనుసరిస్తున్న వారి సంఖ్య
కవిత కల్వకుంట్ల 7.82 లక్షలు
వినోద్‌కుమార్‌ 34 వేలు
బూర నర్సయ్య గౌడ్‌ 10,000
డాక్టర్‌ రంజిత్‌రెడ్డి 5,000
బీబీ పాటిల్‌ 845
తలసాని సాయికిరణ్‌ 842
ఎంఎల్‌ఆర్‌ రాజశేఖర్‌ 126
కొత్త ప్రభాకర్‌రెడ్డి 59

ఫేస్‌బుక్‌లో..
కల్వకుంట్ల కవిత 8.33 లక్షలు
తలసాని సాయి కిరణ్‌ 25,000
బూర నర్సయ్యగౌడ్‌ 7,000

కాంగ్రెస్‌ అభ్యర్థులు..

కాంగ్రెస్‌ నాయకులు, అభ్యర్థులు ట్విటర్‌లో చురుగ్గా ఉంటున్నారు. కాంగ్రెస్‌పార్టీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ అధికారపక్షంపై రాజకీయ విమర్శలు చేయడానికి ట్విటర్‌ను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. పార్టీ కార్యక్రమాలను ట్విట్టర్‌ వేదిక ద్వారా కార్యకర్తలు, అభిమానులకు వివరిస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వేదికలుగా వివరిస్తున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాలో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న కాంగ్రెస్‌ నాయకుడిగా వంశీచంద్‌రెడ్డి నిలిచారు. ఆయన తరువాత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డికి తమ ఫేస్‌బుక్‌ ఖాతాల్లో అధిక సంఖ్యలో అభిమాలు ఉన్నారు.

ట్విటర్‌లో..
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 49,000
వంశీచంద్‌రెడ్డి 29,000
కొండా విశ్వేశ్వరరెడ్డి 23,900
రేవంత్‌రెడ్డి 21,000
మధుయాస్కీగౌడ్‌ 13,000
గాలి అనిల్‌కుమార్‌ 6,652
పొన్నం ప్రభాకర్‌ 4,171
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1,845
కె.మదన్‌మోహన్‌రావు 963

ఫేస్‌బుక్‌లో...
వంశీచంద్‌రెడ్డి 5,30,000
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 5,18,000
రేవంత్‌రెడ్డి 5,00,000
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1,60,000
కొండా విశ్వేశ్వరరెడ్డి 55,000

భాజపా అభ్యర్థులు

భాజపా తరపున లోక్‌సభ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు తమ సామాజిక ఖాతాల్లో పేరుకు ముందు ‘చౌకీదార్‌’ పదాన్ని చేర్చుకున్నారు. నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి అభ్యర్థులు ఈ మేరకు మార్పులు చేసుకున్నారు. వీరిలో కిషన్‌రెడ్డికి సామాజిక మాధ్యమ ఖాతాల్లో అత్యధికంగా అనుచరులు ఉన్నారు. ఈయనను ట్విటర్‌లో 1,19,000, ఫేస్‌బుక్‌లో 2,46,000 మంది అనుసరిస్తున్నారు.

ట్విటర్‌లో..:
కిషన్‌రెడ్డి 1,19,000
రామచంద్రారావు 12,000
అర్వింద్‌ ధర్మపురి 997

ఫేస్‌బుక్‌లో..:
కిషన్‌రెడ్డి 2,46,000

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.