close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మశూచి... అంతమై 40 ఏళ్లు

నాటి స్ఫూర్తితో నేడు ఐక్యపోరాటం తప్పనిసరి

అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 15 ఏళ్లు గడుస్తోంది. ప్రపంచాధిపత్యం కోసం ప్రచ్చన్న యుద్ధం మొదలై ఒకవైపు అమెరికా... మరోవైపు సోవియట్‌ యూనియన్‌ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంకోవైపు ఓ మహమ్మారి సైతం 30 దేశాల్లోని మనుషులను కబళిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఆ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) 1958లో నిర్వహించిన సమావేశంలో.. శతాబ్దాలుగా మనల్ని కబళిస్తున్న మహమ్మారిపై ఉమ్మడి పోరు చేద్దామంటూ రష్యా అనూహ్యంగా ప్రతిపాదించడం, తక్షణమే అమెరికా అంగీకరించడంతో సభ్య దేశాలు రంగంలోకి దూకాయి. విజయం సాధించాయి. నాడు నిర్మూలించిన మహమ్మారి పేరే మశూచి. ఆ విజయాన్ని ప్రకటించిన రోజు 1980 మే 8. ఈ మహత్తర ఘట్టానికి శుక్రవారం (ఈ నెల 8) నాటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో నాడు మశూచిపై చేసిన పోరాటం ఇప్పటికీ స్ఫూర్తిదాయకం... అనుసరణీయం.

ఇదీ మశూచి చరిత్ర..
వరియోల అనే వైరస్‌ కారణంగా సోకే ఈ అంటువ్యాధి వేల సంవత్సరాలపాటు మనుషులను పీడించింది. ఈజిప్టును క్రీ.పూ.1150-45 మధ్య పరిపాలించిన ఫారో రామ్‌సెస్‌-5 మరణానికి ఇదే కారణమైంది. ఒక్క 20వ శతాబ్దంలోనే దాదాపు 30 కోట్ల మందిని కబళించింది.
* లక్షణాలు: తీవ్ర జ్వరం, చర్మంపై పొక్కులు

 

* వ్యాప్తి ఇలా..: వ్యాధిగ్రస్తుల తుంపర్లు, వారు తాకిన వస్తువుల ద్వారా. బాధితులు కూర్చుని వెళ్లిపోయిన తర్వాత అక్కడికి 4 గంటల తర్వాత వెళ్లినా.. గాలి ద్వారా వైరస్‌ సోకుతుందని తేల్చారు.
* తీవ్రత: ఇది సోకిన వారిలో 30% మంది చనిపోయేవారు. బతికిన వారిలోనూ చాలామంది అంధులయ్యేవారు.
* మందులేమీ లేవా?: బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్‌ జెన్నర్‌ 1796లోనే ప్రపంచంలోనే మొదటి టీకా కనిపెట్టారు. దాని ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడం, అన్ని దేశాలకు అందుబాటులో లేకపోవడంతో 200 ఏళ్లపాటు వైరస్‌ విజృంభణ కొనసాగింది.
* పోరాటం సాగిందిలా: అమెరికా, సోవియట్‌లు సమ్మతించినా...   డబ్ల్యూహెచ్‌వో చేతిలో డబ్బులేమీ లేవు. మెల్లగా ఆర్థిక వనరులు, టీకాలను సమకూర్చుకుని 1967లో ప్రపంచ ‘మశూచి నిర్మూలన కార్యక్రమం’ ప్రారంభించింది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. వ్యాధిగ్రస్తులకు టీకాలు వేశారు. వైరస్‌ కాంటాక్టులను గుర్తించారు. వారికీ టీకాలు ఇచ్చారు. పరిశుభ్రతపై విస్తృత ప్రచారం చేశారు. ఒకచోట గుమిగూడటాన్ని నిషేధించారు. మాస్కులు వాడటాన్నీ ప్రోత్సహించారు. ఇప్పుడు మనం పాటిస్తున్న హోం క్వారంటైన్‌ అప్పట్లోనే మొదలైంది.
* పదేళ్లకు చివరి కేసులు: 1977లో చివరిసారిగా సోమాలియాలో, మరో ఏడాదికి బ్రిటన్‌లో ఒక్కో బాధితుడ్ని గుర్తించారు.
* ప్రకటన ఎప్పుడు: ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్య దేశాల ప్రతినిధులంతా కలిసి 1980, మే 8న ‘మశూచికి కారణమవుతున్న వరియోల వైరస్‌ ఇక చరిత్ర పుటల్లోనే ఉంటుంది’ అని ప్రకటించారు.
* ఆ వైరస్‌ ఉందా: మశూచి వైరస్‌ను అట్లాంటాలోని సీడీసీ(అమెరికా), నొవొసిబిర్స్క్‌లోని వెక్టార్‌(రష్యా)లో మాత్రమే భవిష్యత్తు ప్రయోగాల కోసం భద్రపరిచారు.
* ఇప్పుడు మనమేం చేయాలి?: మశూచిని ప్రపంచదేశాలు తుదముట్టించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని... కరోనాకు టీకా, మందులు వచ్చేవరకు ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. భౌతిక దూరంతోపాటు పరిశుభ్రతను పాటిస్తూ.. మాస్కులు ధరించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.