close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐదు నెలల్లో 64,911.. ఆగస్టులోనే 62,911

రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తీరిది
గత నెలలోనే 306 మంది మృత్యువాత
కొత్తగా 2734 కొవిడ్‌ కేసులు..  9 మరణాలు
1.27 లక్షలకు పెరిగిన మొత్తం బాధితులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ముఖ్యంగా జిల్లాల్లో దీని వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం కొత్తగా 2734 మందికి కొవిడ్‌ నిర్ధారణయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,27,697కు పెరిగింది. ఈ నెల 31న రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. తాజాగా మరో 9 మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 836కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను విశ్లేషిస్తే.. జులై నెలాఖరుకు 64,911 కరోనా కేసులు నిర్ధారణ కాగా, ఒక్క ఆగస్టు నెలలోనే 62,911 పాజిటివ్‌లను నిర్ధారించారు. జులై వరకు 530 మంది కొవిడ్‌తో మృతిచెందగా, గత నెలలో 306 మంది మహమ్మారికి బలయ్యారు. పరీక్షల సంఖ్య పెరగడంతో, బాధితుల సంఖ్యలోనూ పెరుగుదల కన్పిస్తోందని వైద్యవర్గాలు తెలిపాయి.

11 జిల్లాల్లో 100కి పైగా..
తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 347 కేసులు నిర్ధారణయ్యాయి. 10 జిల్లాల్లో 100కిపైగా నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం(117), కరీంనగర్‌(106), ఖమ్మం(161), మేడ్చల్‌ మల్కాజిగిరి(121), నల్గొండ(191), నిజామాబాద్‌(114), రంగారెడ్డి(212), సిద్దిపేట(109), సూర్యాపేట(107), వరంగల్‌ నగర(112) చొప్పున బాధితులు మహమ్మారి బారినపడ్డారు. 20కి పైగా పాజిటివ్‌లు నిర్ధారణయిన జిల్లాల్లో ఆదిలాబాద్‌(27), జగిత్యాల(91), జనగామ(47), జోగులాంబ గద్వాల(42), కామారెడ్డి(72), మహబూబ్‌నగర్‌(66), మహబూబాబాద్‌(81), మంచిర్యాల(96), మెదక్‌(43), ములుగు(24), నాగర్‌కర్నూల్‌(48), నిర్మల్‌(39), పెద్దపల్లి(74), రాజన్న సిరిసిల్ల(49), వనపర్తి(55), వరంగల్‌ గ్రామీణ(30), యాదాద్రి భువనగిరి(76) ఉన్నాయి. మొత్తం పాజిటివ్‌లలో 88,111(69 శాతం) మందికి ఎటువంటి లక్షణాలు లేవని, లక్షణాలతో నిర్ధారణ అయినవారు 39,586(31శాతం) మంది అని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌తో 31,699 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో, ఇళ్లలో 24,598 మంది వైద్యసేవలు పొందుతున్నట్టు వెల్లడించింది.

రెట్టింపైన నిర్ధారణ పరీక్షలు
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 58,264 నమూనాలను పరీక్షించారు. 878 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తెలంగాణలో జులై వరకూ 4,58,593 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఆగస్టులోనే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ (9,65,253) నమూనాలు పరీక్షించినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం మరో 2,325 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా, ఆ సంఖ్య 95,162కి చేరినట్టు తెలిపింది. జులై వరకు 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 42కు తగ్గింది. ఇదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య 94 నుంచి 184కు పెరిగింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.