close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చదువుకు మనఖర్చు ఎక్కువే!

జాతీయ సగటు కంటే అధికం
దేశంలో 5వ స్థానంలో తెలంగాణ
సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం తక్కువ
జాతీయ నమూనా సర్వేలో వెల్లడి

దేశంలోని పలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పిల్లల చదువు కోసం ఒక్కో కుటుంబం చేసే వ్యయం అధికంగా ఉంది. జాతీయ సగటుతో పోల్చి చూసినా ఎక్కువగానే ఉంది. కేవలం దిల్లీ, హరియాణా, పంజాబ్‌, తమిళనాడులో మాత్రమే రాష్ట్రం కంటే ముందున్నాయి.

కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో 2017 జూన్‌ నుంచి 2018 జూన్‌ మధ్య జరిగిన జాతీయ నమూనా సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌)లో ఈ విషయం వెల్లడైంది. ఇంటింటా విద్యపై చేసే ఖర్చు అనే అంశంపై దేశవ్యాప్తంగా 8,087 గ్రామాల్లోని 64,519 ఇళ్లు, 6,188 బ్లాకుల్లోని 49,238 పట్టణ ఇళ్ల నుంచి సర్వే చేసి ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో కుటుంబం తమకొచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం తమ పిల్లల చదువుకు ఖర్చు చేస్తుండగా...అందులో తెలంగాణ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

జాతీయ సగటు రూ.8,331
పూర్వ ప్రాథమిక నుంచి పీజీ వరకు సాధారణ కోర్సులపై ఒక్కో భారతీయ కుటుంబం సంవత్సరానికి సగటున రూ.8,331 వ్యయం చేస్తుండగా తెలంగాణలో రూ.13,095, ఏపీలో రూ.10,045 ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో జాతీయ సగటు కంటే దాదాపు 58 శాతం అధికం. సాంకేతిక, వృత్తి విద్యపై మాత్రం జాతీయ స్థాయి సగటు కంటే తక్కువగా ఉండటం విశేషం. జాతీయ సగటు వ్యయం రూ.50,307 ఉండగా...తెలంగాణలో రూ.47,348, ఏపీలో రూ.36,869 ఉన్నట్లు తేలింది. అయినా సరే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ ఖర్చులో మనది తొమ్మిదో స్థానంలో నిలిచింది.

పాఠశాలల స్థాయిలో నియంత్రణ లేకే...
సర్వేను పరిశీలిస్తే పాఠశాల, ఇంటర్‌ స్థాయిలో ఎక్కువగా ఖర్చు అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. దీనికి ‘ఉన్నత విద్య మాదిరిగా పాఠశాల, ఇంటర్‌ విద్యలో విద్యా సంస్థలు వసూలు చేసే రుసుములపై నియంత్రణ లేకపోవడమే కారణం’ అని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) సంయుక్త కార్యదర్శి కడప వెంకట్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఫీజుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.