వ్యాయామం కోసమే ఈ దుస్తులు..
close
Updated : 17/03/2021 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాయామం కోసమే ఈ దుస్తులు..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అందమైన శరీరాకృతి కారణం ఏదైనా సరే...కాలేజీ అమ్మాయిల నుంచి అరవై ఏళ్ల మహిళల వరకూ అంతా ఫిట్‌నెస్‌ మంత్రం జపిస్తున్నారు.అందుకోసం ఈ యాక్టివేర్‌ (స్పోర్ట్స్‌ వేర్‌)ని ఎంచుకోండి.
యోగా, పరుగు, జుంబా శారీరక శ్రమకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నా ఆ సమయంలో వేసుకునే దుస్తులు సౌకర్యంగా ఉండాలి.  చెమటను పీల్చుకోవాలి. సాగే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా టీషర్ట్‌లూ, ఫోల్డ్‌ఓవర్‌ యోగా ప్యాంట్లూ, ట్రాక్‌సూట్లూ, స్వెట్‌షర్ట్‌లతో పాటు హిప్‌షేపర్‌లూ, ఫంక్షనల్‌ బ్రాలు వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరాలకు తగ్గట్లు  ఎంచుకోండి మరి.

ట్రాక్‌ ప్యాంట్లు: ఫిట్‌నెస్‌వేర్‌ అనగానే వ్యాయామం చేసేప్పుడు మాత్రమే వేసుకునేలా ఉంటాయని పొరబాటు పడొద్దు. వాటిని ఇతర దుస్తులతో మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌లా కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా ట్రాక్‌ ప్యాంట్లకు జతగా ట్యాంక్‌టాప్‌లూ, ట్యూనిక్‌లూ, టీషర్ట్‌లూ, కుర్తీలు వంటివి ఎంచుకోవచ్చు. వీటిల్లో డ్రేప్డ్‌, స్కిన్‌ఫిట్‌ వంటి రకాలున్నాయి. మెష్‌ యోగా ప్యాంట్స్‌ ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌.
బ్రాలు:  వ్యాయామం చేసేప్పుడు తప్పనిసరిగా శరీరాన్ని పట్టి ఉంచే బ్రాని ఎంచుకోవాల్సిందే. ఇది శరీరాకృతిని కోల్పోకుండా కాపాడుతుంది. సాఫ్ట్‌ కప్స్‌ స్పోర్ట్స్‌ బ్రా, ట్రెయినింగ్‌ స్పోర్ట్స్‌ బ్రా లేదా పాడెడ్‌ స్పోర్ట్స్‌ బ్రా ఎంచుకోవాలి.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని