close
Updated : 07/07/2021 13:09 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఆమె పాటకు 105 కోట్ల వ్యూస్‌!

ఈ పాట ఏ పెద్ద హీరోనో, పాప్‌ స్టారో, పెద్ద సింగర్‌దో అయ్యుంటుంది అనుకుంటున్నారా! ఓ ప్రైవేటు ఆల్బమ్‌దే కానీ.. పాడింది మాత్రం ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి. పేరు.. రేణుక పన్వర్‌. మన అమ్మాయే. సోషల్‌ మీడియా మొత్తం ఇప్పుడు ఈమె గురించే!

రేణుకకి చిన్నప్పటి నుంచి పాటలన్నా, డ్యాన్స్‌ అన్నా చాలా ఇష్టం. అమ్మానాన్నలూ బాగా  ప్రోత్సహించారు. వాళ్లది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖేక్‌డా. మధ్య తరగతి కుటుంబం. తండ్రి చిన్న వ్యాపారి. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలన్నింట్లో పాల్గొనేది. బోలెడన్ని బహుమతులూ తెచ్చుకుంది. ఓ హిందీ టీవీ ఛానెల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని టైటిల్‌నూ గెలుచుకుంది. పదో తరగతిలో ఉన్నప్పుడు తన గొంతు విని ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ వాళ్లు అవకాశం ఇచ్చారు. అలా 16 ఏళ్ల వయసులో ‘సున్‌ సోనియో’తో తన మ్యూజికల్‌ కెరియర్‌ ప్రారంభమైంది. దానికి మంచి గుర్తింపు వచ్చింది.

రేణుక ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. హిందీ, హరియాణ్వీ భాషల్లో ప్రైవేటు ఆల్బమ్‌లకు పాడుతోంది. వాటిల్లో నటిస్తోంది కూడా. ఈమె పాటలకు ఒక్కోదానికీ కనీసం పది లక్షల వీక్షణలుండటం విశేషం. ఇప్పటివరకూ తను ఈ వీడియోల ద్వారా మూడు కోట్ల రూపాయలకుపైగా సంపాదించింది. కానీ తన ప్రయాణం సులువేమీ కాలేదంటుంది రేణుక. సంగీత సాధన, రిహార్సల్స్‌ కోసం వెళుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ‘అమ్మాయికి ఇవన్నీ ఎందుకు?’ అనేవారట. చదువు చెప్పించి, ఇంటి పనులు నేర్పించమనీ, గాయనిని చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందనీ సలహాలిచ్చేవారట. తన కుటుంబం అవేవీ పట్టించుకోకుండా తనను ప్రోత్సహించింది.

తాజాగా ఆమె వీడియో ‘52 గజ్‌ కా దమన్‌’ 105 కోట్లకుపైగా వ్యూస్‌ అందుకుంది. హరియాణ్వీ గర్బా ధరించి నీళ్లకోసం వెళుతున్న అమ్మాయిపై సాగే పాట ఇది. ఉర్రూతలూగించే సంగీతం, సంప్రదాయ దుస్తులు, సంస్కృతి, స్థానికతకు ప్రాధాన్యమివ్వడంతో ఈ పాట ఇప్పుడు ఊపేస్తోంది. తనకు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే. తన ఇన్‌స్టా ఖాతాని నాలుగు లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. బాలీవుడ్‌లో అదీ అర్జిత్‌ సింగ్‌తో కలిసి పాడాలన్నది తన కలట. చూస్తోంటే ఆ కోరిక త్వరలోనే తీరేలా కనిపిస్తోంది కదూ!


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని