కల్లోల వేళ..కళాకారులకు ఆసరా
close
Updated : 15/06/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కల్లోల వేళ..కళాకారులకు ఆసరా

కరోనా, లాక్‌డౌన్‌ల వల్ల ఎంతోమంది కళాకారులు ఆదాయం లేక రోడ్డునపడ్డారు. అలాంటి వారిని చూసి చలించిపోయింది ప్రముఖ కథక్‌ నృత్యకారిణి మంజరి చతుర్వేది. తోటి కళాకారులకు సాయమందించాలనుకుంది.
‘మహమ్మద్‌ తాజ్‌ కవాలీ సింగర్‌. కచేరీలతో ఎప్పుడూ బిజీగా ఉండే అతను కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడు కూరగాయలను అమ్ముతున్నాడు. ఒక్కోరోజు పూట గడవడమూ కష్టంగానే ఉంది. ఇతనే కాదు.. ఇలా ఎందరో కళాకారులు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధిని కోల్పోయారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తుంది మంజరి. లఖ్‌నవూకు చెందిన ఈమె ప్రఖ్యాత సూఫీ కథక్‌ నృత్యకారిణి. కరోనా కారణంగా రోడ్డునపడ్డ కళాకారులకు గురించి తెలియగానే ఆమె తన ‘సూఫీ కథక్‌ ఫౌండేషన్‌’లోని సభ్యులు, స్నేహితులను సంప్రదించింది. తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టుపెట్టి సాయం చేయమని కోరింది. కళలపై ఆసక్తి ఉన్నవారు విరాళాలను ఇవ్వడం ప్రారంభించారు. అలా రూ.25 లక్షలకు పైగా సేకరించింది. వారి అవసరాలనుబట్టి నెలకు రూ.3000-రూ.5000 వరకూ అందిస్తుంది. అలా యూపీ, దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌లలో 150 కుటుంబాలకు ఆర్థిక సాయం కల్పిస్తోంది. ఆర్థికంగానే కాదు.. మరే ఇతర సాయం కావాల్సినా అందిస్తోంది.
‘కళాకారులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కచేరీలే ఆధారం. వాటితోనే కుటుంబాలు గడిచేది. అలాంటిది కరోనా కారణంగా ఒక్కపూట కూడా తినలేని స్థితికి చేరుకున్నారు. సాయం కోరుతూ వాళ్లు అభ్యర్థించడం మనసుకు కష్టంగా అనిపిస్తోంది’ అంటోంది మంజరి. కేవలం విరాళాలమీదే ఇప్పటి వరకూ సాయమందిస్తున్నారు. వీటి మీదే ఆధారపడటం రానురానూ కష్టమవుతోంది. ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాల కోసమంటూ కొంత పక్కనపెడుతుంది. వాటిని ప్రత్యేక పరిస్థితులుగా పరిగణించి పేద కళాకారులకు ఇవ్వాలని కోరుతోంది.


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని