విదేశంలో విడాకులు చెల్లుతాయా?
close
Updated : 05/06/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశంలో విడాకులు చెల్లుతాయా?

నేను ,నా భర్త ఎన్నారైలం. ఇద్దరికీ అమెరికా పౌరసత్వం ఉంది. పెళ్లయినప్పటి నుంచీ ఆయన మానసికంగా, శారీరకంగా నేను తగిన భార్యని కాదంటున్నారు. విడాకులు తీసుకుందామని ఒత్తిడి తీసుకువస్తున్నారు. మేము ఇక్కడ విడాకులు తీసుకుంటే ఇండియాలో చెల్లుతుందా? పిల్లలు నా దగ్గర ఉండే అవకాశముందా? - ఓ సోదరి, న్యూయార్క్‌
మీరు, మీ భర్త యూఎస్‌ పౌరసత్వం తీసుకున్నారు కాబట్టి అక్కడ విడాకులు తీసుకున్నా చెల్లుతుంది. అయితే పెళ్లి భారత్‌లో జరిగింది కాబట్టి మీరిద్దరూ అమెరికా చట్టపరిధిని సమ్మతిస్తేనే... డైవోర్స్‌ మంజూరు అవుతాయి. మీరు ఒప్పుకోకుండా అక్కడ అతను విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. మీకు ఆ దేశ పౌరసత్వం ఉన్నా మీ జన్మస్థలం భారత్‌లోనే కాబట్టి ఇక్కడకు వచ్చి అతని మీద గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయండి. అది తేలేవరకూ అక్కడ విడాకులు తీసుకోవడం కుదరదని కోర్టులు తీర్పు ఇచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయి. మనదేశంలోనే కాదు... అమెరికాలోనూ గృహహింసను తీవ్రంగా పరిగణిస్తారు. దాంతో పాటు అతడిపై వరకట్న వేధింపుల కేసునీ వేయండి.  మెయింటెనెన్స్‌తో పాటు పిల్లల కస్టడీ కోరుతూ విడిగా దరఖాస్తు చేసుకోండి. ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ సాయమూ కోరవచ్చు. జాతీయ మహిళా కమిషన్‌కి లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే వారూ సహకరిస్తారు. ఎంబసీతో మాట్లాడి రక్షణ కల్పిస్తారు. అవసరమైతే న్యాయ సాయం కోసం లాయర్‌నీ ఏర్పాటు చేస్తారు. ముందు ఒక భారతీయ న్యాయవాది/అటార్నీని కలిసి సరైన నిర్ణయం తీసుకోండి. భార్యని హింసిస్తే భారత్‌ అయినా అమెరికాలో అయినా శిక్షార్హులే.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని