close
Published : 18/03/2021 00:51 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఇది... సువాసనల స్నానం!

స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కదా... ఒంటికి పట్టిన చెమటా, మురికీ... వదిలిపోయి ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. ఇదేేకాకుండా మరింత సాంత్వన పొంది హాయిగా నిద్రపోవాలను కుంటున్నారా... అయితే లావెండర్‌ బాత్‌సాల్ట్‌తో ప్రయత్నించి చూడండి.

రుకుల పరుగుల జీవితాల్లో కొంతమంది స్నానానికీ ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అలాంటివారికి బాత్‌సాల్టే చక్కని మార్గం. ఎందుకంటే తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించినా ఆ సుగంధాలు రోజంతా అంటిపెట్టుకునే ఉంటాయి.
నీళ్లలో కాస్త బాత్‌సాల్ట్‌ కలిపేస్తే పరిశుభ్రత, పరిమళాల స్నానం పూర్తవుతుంది. అంతేకాదు చర్మం నున్నగా మెరుస్తుంది కూడా.
ఉప్పు ఒంటి నొప్పులను తగ్గిస్తుంది. లావెండర్‌ సువాసనలు ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ బాత్‌సాల్ట్‌ను ఇంట్లోనే తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు హాయిగా వాడుకోవచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని