close
Updated : 20/03/2021 06:24 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మట్టి పొడిబారకుండా ఉండాలంటే...!

మొక్కల పెంపకం అంటే నాకు ఆసక్తి. అయితే ఒక్కరోజు ఇంటిని వదిలివెళ్లాలన్నా... నీళ్లు లేక వాడిపోతాయేమో అని భయం. పైగా ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమైనా ఉంటే చెప్పగలరు? - గీతిక, హైదరాబాద్‌
ఎండాకాలం వచ్చేసింది. ఈ రోజుల్లో ఒక్క పూట నీళ్లు సరిపోకపోయినా మొక్కలు తలవాల్చేస్తాయి. అందుకే వాటికి నీటిని అందించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  మొక్క చుట్టూ ఉన్న మట్టిని మల్చింగ్‌ చేయాలి. అంటే పై పొరను వదులుగా తవ్వి దానిపై గడ్డి, ఎండిన ఆకులు, రంపపు పొట్టు, వేళ్లు, కొబ్బరిపీచు, పీట్‌మాస్‌, కంపోస్ట్‌ వంటి వేయాలి. ఇవన్నీ నీళ్లను పీల్చుకుని మొక్కను తేమగా ఉంచుతాయి. తొట్టె అడుగున స్పాంజ్‌ని ఉంచితే... ఎక్కువైన నీళ్లను ఇది ఇముడ్చుకుని వేళ్లకు అవసరమైన తేమను అందిస్తుంది. కొద్ది కొద్దిగా అయినా పూర్తిగా వేళ్లు తడిచేలా నీళ్లు పోయాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని