close
Updated : 29/03/2021 03:37 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

నొప్పుల్ని తగ్గించే ఇలాచీ టీ!

టీ తాగకపోతే చాలామందికి మనసు నిలవదు.  అలాంటివారు సాధారణ తేనీటికి బదులు యాలకుల చాయ్‌ తాగితే సరి. వీటిల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అవేంటంటే...

* ఇలాచీ చాయ్‌ అజీర్తి సమస్యను నివారిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఓ కప్పు తాగితే ఫలితం ఉంటుంది. మలబద్ధకాన్నీ దూరం చేస్తుంది.
* యాలకుల్లో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తాయి. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి. రోజులో రెండు మూడు సార్లైనా టీ తాగేవారు ఓ సారి దీనికి ప్రాధాన్యం ఇవ్వండి.
* వీటిలో యాంటీవైరల్‌, యాంటీఫంగల్‌, యాంటీమైక్రోబియల్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అందువల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోటి దుర్వాసనా తగ్గుతుంది.
* నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు ఓ కప్పు ఇలాచీ చాయ్‌ తాగి చూడండి. ఉపశమనం దొరుకుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని