close
Published : 09/04/2021 00:56 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

ఎండల్లో హాయ్‌హాయ్‌...

ఠారెత్తిస్తున్న ఎండల్లో సైతం మంచు కొండల్లో విహరిస్తున్న అనుభూతిని పొందాలనుకుంటున్నారా... అయితే వెంటనే కూలింగ్‌ గ్లాస్‌లు పెట్టుకోవాల్సిందే. వీటిల్లో స్క్వేర్‌షేప్‌వి ఎక్కువమందిని ఆకట్టుకుంటున్నాయి. ఇక క్యాట్‌ ఐ ఆకారంలోని సన్‌ గ్లాసెస్‌ పై అంచు కొంచెం బయటకు వచ్చి వినూత్నంగా ఉంటాయి. రాప్‌ ఎరౌండ్‌ సన్‌ గ్లాస్‌లు కళ్లకు పూర్తి రక్షణను ఇస్తాయి. పెద్ద ఫ్రేమ్‌తో, కళ్లకు దగ్గరగా ఉండి.. వేడి గాలి కళ్లలోకి వెళ్లకుండా నిరోధించడంతో పాటు స్పోర్టీ లుక్‌తో కనిపిస్తాయి. చదరం, దీర్ఘచతురస్రం ఆకారాల్లోవి అతివల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌గా మారాయి. బటర్‌ఫ్లై సన్‌గ్లాసెస్‌ సీతాకోకచిలుకలా ముఖానికి ప్రత్యేకతనూ తీసుకొస్తాయి. రిఫ్లెక్టర్‌ సన్‌గ్లాస్‌లు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. బయటి ప్రపంచం అద్దాల మీద ప్రతిబింబిస్తుంటే లోపలి నుంచి చూడటం ఓ సరదా. ఇంకా షడ్భుజి, పంచభుజి.. ఇలా ఎన్నో ఆకృతుల్లో కళ్లజోళ్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చినవాటిని ఎంచుకోండి మరి...

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని