close
Published : 17/04/2021 01:16 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

షిప్టుల్లో పనిచేస్తున్నారా...

వృత్తి ఉద్యోగాలకు స్త్రీపురుష బేధం లేదు. అంకితభావంతో పనిచేయాలే గానీ ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు. అయితే కొన్ని కొన్ని రంగాల్లో షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. ఇంట్లో వంటావార్పూ, పిల్లల పెంపకం లాంటి బృహత్తర బాధ్యతలు నెరవేర్చాల్సిన మహిళలకు ఇది ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలో షిఫ్టుల్లో పనిచేస్తూనే ఇబ్బందులను అధిగమించేందుకు కొన్ని సూచనలు...

ఏ షిఫ్టయినా భోజన వేళలు మారకుండా చూసుకుంటూ పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
* కుటుంబసభ్యులతో గడిపే కాలం తగ్గుతుంది కాబట్టి వీలున్నప్పుడు, ప్రయాణంలోనూ... అవసరమైన అంశాలను ఫోన్‌లో చెప్పడం, భర్త, పిల్లలకు చిన్న చిన్న నోట్‌లు రాసి కనిపించేలా అతికించడంతో ఆ భర్తీని పూరించవచ్చు.
* నిద్రలేమి అనేక వ్యాధులకు కారణమవుతుంది. నిద్ర ఏడెనిమిది గంటలకు తక్కువ కాకుండా చూసుకోవాలి.
* పనివేళల్లో మార్పు వల్ల హృద్రోగాలు, కడుపుబ్బరం, ఊబకాయం లాంటి అనేక సమస్యలు తలెత్తకుండా వ్యాయామం చేయాలి.
* మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం తప్పనిసరి. సొంతంగా వాహనం నడకపోతే ప్రయాణ సమయంలోనూ ధ్యానం చేయొచ్చు.
* రాత్రివేళల్లో పనిచేసే మహిళలు తమ రక్షణ గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని