వ్యాయామం చేస్తున్నారా? ఒక్క క్షణం...
close
Updated : 21/04/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాయామం చేస్తున్నారా? ఒక్క క్షణం...

రోజూ వ్యాయామం చేయడం మంచిదే! కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నాయి అధ్యయనాలు. అవేంటో తెలుసుకుందాం.
జిమ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లో ఉపయోగించే యంత్రాలను ఎప్పటికప్పుడు యాంటీ బ్యాక్టీరియల్‌ లిక్విడ్‌తో తుడవాలి. ఇంట్లో ఉపయోగించే వ్యాయామ సాధనాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* కసరత్తులు చేసేటప్పుడు రిస్ట్‌బ్యాండ్స్‌, ఆభరణాలు వంటివి ఏవీ ఉంచుకోవద్దు. వీటివల్ల చెమట పట్టి చర్మ సమస్యలు వస్తాయి.
* మేకప్‌తో వర్క్‌వుట్‌లు చేయకూడదు. ఇందులో ఉండే రసాయనాలు చెమటలో కలవడం వల్ల మొటిమలు, దద్దుర్లు ఇబ్బంది పెడతాయి.
* చాలా మంది శరీరం మీద ఉన్న చెమటను, వేసుకున్న దుస్తులతోనే తుడుచుకుంటారు. దానివల్ల దురద, రాషెస్‌ లాంటివి రావొచ్చు.  
* సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల్ని ధరించాలి. కాటన్‌వైతే మరీ మంచిది. ఇవి చెమటను పీల్చుకుంటాయి. వ్యాయామానికి ప్రత్యేక టీషర్ట్‌లు, ట్రాక్‌ సూట్లు, స్వెట్‌ షర్ట్‌లు, ఫోల్డ్‌ ఓవర్‌ యోగా ప్యాంట్లు వంటి ఎన్నో దుస్తులు అందుబాటులోకి వచ్చేశాయి. వాటిలో మీ అవసరం, సౌకర్యాలను బట్టి తగినవి ఎంచుకోవచ్చు.


మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని