close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం 

విజయనగరం జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో ముడిపడి ఉంది. విజయనగరం, అరకు, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాల్లో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు భాగంగా ఉన్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తర్వాత బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం విజయనగరంగా, పార్వతీపురం నియోజకవర్గం అరకు నియోజకవర్గంలోకి వెళ్లాయి.  విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో విజయనగరం జిల్లాకు చెందిన శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. విజయనగరం నియోజకవర్గం ప్రస్తుతం జనరల్‌ కేటగిరిలో ఉంది. దీనిలో విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. 
2009 తొలిసారి విజయనగరం లోక్‌సభ స్థానం ఏర్పడిన తర్వాత కాంగ్రెస పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బేబి నాయనపై తెదేపా అశోక్‌ గజపతిరాజు 1,07425 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

1967 నుంచి 2009 వరకు విజేతలు వీరే!
బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నపుడు..
* 1967 : కర్రి నారాయణరావు- కాంగ్రెస్ పార్టీ 
* 1971 : కర్రి నారాయణరావు- కాంగ్రెస్ 
* 1977 : పి.వి.జి.రాజు - కాంగ్రెస్ 
* 1980 : పి.వి.జి.రాజు - కాంగ్రెస్ 
* 1985 : ఆనందగజపతిరాజు - తెలుగుదేశం 
* 1989 : కెంబూరి రామ్మోహనరావు - తెలుగుదేశం 
* 1991 : ఆనందగజపతిరాజు - కాంగ్రెస్ 
* 1996 : కె.పైడితల్లినాయుడు - తెలుగుదేశం 
* 1998 : కె.పైడితల్లినాయుడు - తెలుగుదేశం 
* 1999 : బొత్స సత్యనారాయణ- కాంగ్రెస్ 
* 2004 : కొండపల్లి పైడితల్లినాయుడు - తెలుగుదేశం 
* 2007 (ఉప ఎన్నిక) : బొత్స ఝాన్సీలక్ష్మి
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంగా మారాక 
* 2009 : బొత్స ఝాన్సీలక్ష్మి - కాంగ్రెస్
* 2014: పూసపాటి అశోక్‌ గజపతి రాజు(తెదేపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net