close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ సమాచారం 

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. విశాఖ నగరంలోని భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట అసెంబ్లీ స్థానాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.

విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 16సార్లు ఎన్నికలు జరగ్గా, 9సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. రెండు సార్లు తెలుగుదేశం గెలవగా, సోషలిస్ట్‌ పార్టీ, స్వతంత్ర, భాజపా అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్‌ విజయమ్మపై భాజపాకు చెందిన కె.హరిబాబు 90,698 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుతం విశాఖ నుంచి తెదేపా తరపున భరత్‌ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భాజపా నుంచి పురందేశ్వరిలు పోటీ చేస్తున్నారు. 

విశాఖ లోక్‌సభ నియోజకవర్గ విజేతలు వీరే!
* 1952-57 - లంక సుందరం, గాం మల్లుదొర - స్వతంత్ర 
* 1957-62 - పూసపాటి విజయరామ గజపతిరాజు - సోషలిస్టు పార్టీ 
* 1962-67 - పూసపాటి విజయానంద గజపతిరాజు - కాంగ్రెస్ 
* 1967-71 - తెన్నేటి విశ్వనాథం - ప్రోగ్రెసివ్ గ్రూప్ 
* 1971-77 - డాక్టర్ పి.వి.జి.రాజు - కాంగ్రెస్ 
* 1977-80 - ద్రోణంరాజు సత్యనారాయణ - కాంగ్రెస్ 
* 1980-84 - కె.ఎ.స్వామి - కాంగ్రెస్ 
* 1984-89 - భాట్టం శ్రీరామమూర్తి - తెలుగుదేశం 
* 1989-91 - ఉమా గజపతిరాజు - కాంగ్రెస్ 
* 1991-96 - డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి - తెలుగుదేశం 
* 1996-98 - డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి - కాంగ్రెస్ 
* 1998-99 - డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి - కాంగ్రెస్ 
* 1999-2004 - డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి - తెలుగుదేశం 
* 2004-09 - నేదురుమల్లి జనార్దనరెడ్డి - కాంగ్రెస్ 
* 2009-14 - దగ్గుబాటి పురందేశ్వరి - కాంగ్రెస్
* 2014-19- కె. హరిబాబు(భాజపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net