close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం 

కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్‌ కేటగిరీ అయిన ఈ నియోజకవర్గం పరిధిలో కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట.. శాసనసభ స్థానాలు ఉన్నాయి. 
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పలువురు నాయకులు కేంద్ర మంత్రలుగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు, రామ సంజీవరావు, పళ్లంరాజులు మంత్రి పదవులు చేపట్టిన వారిలో ఉన్నారు.

తొలిసారి ఎన్నికల్లో సీపీఐ విజయం సాధించగా, తొమ్మిదిసార్లు కాంగ్రెస్‌ పార్టీ, అయిదు సార్లు తెదేపా, ఒకసారి భాజపా విజయం గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చలముల శెట్టి సునీల్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట నర్సింహ 3,431 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

కాకినాడ పార్లమెంట్‌కు ఎన్నికైన ఎంపీలు
*
1952 - సి.వి.రామారావు - సీపీఐ 
* 1957(ద్వి)-బి.ఎస్.మూర్తి(కాంగ్రెస్), మొసలికంటి తిరుమలరావు-కాంగ్రెస్ 
* 1962- మొసలికంటి తిరుమలరావు - కాంగ్రెస్
1967- మొసలికంటి తిరుమలరావు -కాంగ్రెస్ 
* 1971- ఎం.ఎస్ సంజీవరావు - ||1977- ఎం.ఎస్ సంజీవరావు - -కాంగ్రెస్ 
* 1980- ఎం.ఎస్ సంజీవరావు - కాంగ్రెస్.ఐ 
* 1984- తోట గోపాలకృష్ణ - తెదేపా 
* 1989 - ఎంఎం పళ్లంరాజు - కాంగ్రెస్ 
* 1991 - తోట సుబ్బారావు - తెదేపా 
* 1996 - తోట గోపాలకృష్ణ - తెదేపా 
* 1998 - యు.వి.కృష్ణంరాజు - భాజపా 
* 1999 - ముద్రగడ పద్మనాభం - తెదేపా 
* 2004 - ఎం.ఎం.పళ్లంరాజు - కాంగ్రెస్ 
* 2009 - ఎం.ఎం పళ్లంరాజు - కాంగ్రెస్

2014- తోట నర్సింహ - తెదేపా 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net