close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం 

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఆవిర్భవించింది. 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దీన్ని ఎస్సీలకు కేటాయించారు. అమలాపురం పరిధిలో రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రవీంద్రబాబు 1,10,684ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

అమలాపురం నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులు వీరే!
*
1962- బయ్యా సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్) 
* 1967- బయ్యా సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్) 
* 1971- బయ్యా సూర్యనారాయణ మూర్తి(కాంగ్రెస్) 
* 1977- కుసుమ కృష్ణమూర్తి(కాంగ్రెస్) 
* 1980- కుసుమ కృష్ణమూర్తి(కాంగ్రెస్) 
* 1984- ఐ.జె వెంకట బుచ్చి మహేశ్వరరావు(తెదేపా) 
* 1989- కుసుమ కృష్ణమూర్తి(కాంగ్రెస్) 
* 1991- జి.ఎమ్.సి. బాలయోగి(తెదేపా) 
* 1996- కె.ఎస్.ఆర్.మూర్తి(కాంగ్రెస్) 
* 1998- జి.ఎమ్.సి. బాలయోగి(తెదేపా) 
* 1999- జి.ఎమ్.సి.బాలయోగి(తెదేపా) 
* 2004- జి.వి.హర్షకుమార్(కాంగ్రెస్) 
* 2009- జి.వి.హర్షకుమార్(కాంగ్రెస్)
* 2014- రవీంద్రబాబు(తెదేపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net