close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం 

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పడిన లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు రాజమండ్రి కూడా ఆవిర్భవించింది. తొలి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు, శాసనసభా నియోజకవర్గములు తొలగిపోయి పశ్చిమగోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చి చేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా  నియోజకవర్గములు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.
నియోజకవర్గాలు: ఈ లోక్‌సభ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, రాజానగరం, రాజమండ్రి నగరం, రాజమండ్రి గ్రామీణం, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు (ఎస్సీ), నిడదవోలు, గోపాలపురం (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 

ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరగ్గా, మొదటిసారి 1952లో నల్లారెడ్డి నాయుడు(ప్రజా సోసలిస్టు పార్టీ) గెలుపుపొందారు. పదిసార్లు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, తెలుగుదేశం మూడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు రెండు సార్లు గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బి.ఎ.చౌదరిపై సినీ నటుడు, తెదేపా అభ్యర్థి మురళీమోహన్‌ 1,67,697 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

రాజమండ్రి నుంచి గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952- కానేటి మోహనరావు, నల్లా రెడ్డి నాయుడు(కమ్యూనిస్ట్‌ పార్టీ)
* 1957-    డి.ఎస్.రాజు(కాంగ్రెస్‌)
* 1962-     డి.ఎస్.రాజు(కాంగ్రెస్‌)
* 1967-     డి.ఎస్.రాజు(కాంగ్రెస్‌)
* 1971-     ఎస్.బి.పి.పట్టాభి రామారావు(కాంగ్రెస్‌)
* 1977-  ఎస్.బి.పి.పట్టాభి రామారావు(కాంగ్రెస్‌)
* 1980-  ఎస్.బి.పి.పట్టాభి రామారావు(కాంగ్రెస్‌)
* 1984-  చుండ్రు శ్రీహరిరావు(తెలుగుదేశం)
* 1989-  జూలూరి జమున(కాంగ్రెస్‌)
* 1991-  కె.వి.ఆర్. చౌదరి(తెలుగుదేశం)
* 1996- చిట్టూరి రవీంద్ర(కాంగ్రెస్‌)
* 1998- గిరజాల వెంకటస్వామి నాయుడు(భాజపా)
* 1999- ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణరావు(భాజపా)
* 2004- ఉండవల్లి అరుణ కుమార్(కాంగ్రెస్‌)
* 2009- ఉండవల్లి అరుణ కుమార్(కాంగ్రెస్‌)
* 2014- మాగంటి మురళీమోహన్(తెలుగుదేశం)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net