close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం 

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. జనరల్‌ కేటగిరీలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, కృష్ణా జిల్లా పరిధిలోని కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు పరిధిలో ఉన్నాయి.
ఏలూరు పార్లమెంటు స్థానంలో ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు నిర్వహించారు. 1952లో ద్విసభ్యత్వం ఉండటంతో మొత్తం 16 మంది ఇప్పటివరకూ ప్రాతినిధ్యం వహించారు. వీటిలో ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు తెదేపా, రెండు సార్లు సీపీఐ, ఒకసారి కెఎంపీపీ, ఒకసారి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో అత్యధికంగా తెదేపాకు చెందిన బోళ్ల బులిరామయ్య నాలుగు సార్లు 1984, 1991, 1996, 1999 సంవత్సరాల్లో విజయం సాధించారు. సీపీఐకు చెందిన కొండ్రు సుబ్బారావు, వి.విమలాదేవి, కెఎంపీపీకి చెందిన బీఎస్‌మూర్తి, కాంగ్రెస్ తరపున కెఎం వేదకుమారి, కొమ్మారెడ్డి సూర్యనారాయణ మూడు సార్లు, ఘట్టమనేని కృష్ణ, మాగంటి వెంకటేశ్వరరావు, ఇందిరా కాంగ్రెస్ తరపున  చిట్టూరి సుబ్బారావు చౌదరిలు ప్రాతినిధ్యం వహించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్‌పై మాగంటిబాబు 1,01872 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952-1957 కొండ్రు సుబ్బారావు సీపీఐ (కొద్ది కాలంలోనే సుబ్బారావు మృతిచెందగా, ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సీపీఐకే చెందిన బి. సూర్యనారాయణమూర్తి గెలుపొందారు) 
* 1957-1962 మోతే వేదకుమారి (కాంగ్రెస్) 
* 1962-1967 వి. విమలాదేవి (సీపీఐ) 
* 1967-1980 కొమ్మారెడ్డి సూర్యనారాయణ కాంగ్రెస్ (1967 నుంచి 80 వరకు మూడు పర్యాయాలు గెలుపొందారు) 
* 1980-1984 చిట్లూరి సుబ్బారావుచౌదరి కాంగ్రెస్ 
* 1984-1989 బోళ్ల బుల్లిరామయ్య తెదేపా 
* 1989-1991 ఘట్టమనేని కృష్ణ కాంగ్రెస్ 
* 1991-1996 బోళ్ల బుల్లిరామయ్య తెదేపా 
* 1996-1998 బోళ్ల బుల్లిరామయ్య తెదేపా 
* 1998-1999 మాగంటి బాబు కాంగ్రెస్ 
* 1999-2004 బోళ్ల బుల్లిరామయ్య తెదేపా 
* 2004-2009 కావూరి సాంబశివరావు కాంగ్రెస్
2009-2014 కావూరు సాంబశివరావు(కాంగ్రెస్‌)
* 2014- 2019 మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)(తెదేపా)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net