close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం 

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్‌ కేటగిరీలో ఉన్న ఈ నియోజకవర్గం పరిధిలో, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ,  పెనమలూరు, పామర్రు, గన్నవరం శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. తొలిసారి ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ విజయం సాధించగా, పదిసార్లు కాంగ్రెస్‌ పార్టీ, నాలుగుసార్లు తెలుగుదేశం, ఇతరులు ఒకసారి విజయం సాధించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పార్థసారథిపై కొనకళ్ల నారాయణ 84,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952-57: సనక బుచ్చికోటయ్య(సీపీఐ(ఎం)
* 1957-62: మండలి వెంకట కృష్ణారావు(కాంగ్రెస్)
* 1962-67: ఎమ్.వి.స్వామి(ఇతరులు)
* 1967-71: వై.అంకినీడు ప్రసాద్    (కాంగ్రెస్)
* 1971-77: మేడూరి నాగేశ్వరరావు(కాంగ్రెస్)
* 1977-80: మాగంటి అంకినీడు(కాంగ్రెస్)
* 1980-84: మాగంటి అంకినీడు(కాంగ్రెస్)
* 1984-89: కావూరి సాంబశివరావు(కాంగ్రెస్)
* 1989-91: కావూరి సాంబశివరావు(కాంగ్రెస్)
* 1991-96: కావూరి సాంబశివరావు(కాంగ్రెస్)
* 1996-98: కైకాల సత్యనారాయణ(తెదేపా)
* 1998-99: కావూరి సాంబశివరావు(కాంగ్రెస్)
* 1999-04: అంబటి బ్రాహ్మణయ్య(తెదేపా)
* 2004-09: బాడిగ రామకృష్ణ(కాంగ్రెస్)
* 2009-14: కొనకళ్ల నారాయణరావు(తెదేపా)
2014-19: కొనకళ్ల నారాయణరావు(తెదేపా)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net