close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం 

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. తొలిసారి స్వతంత్ర అభ్యర్థి హరిశ్ఛంద్ర చటోపాధ్యాయ విజయం సాధించగా, 1967లో డాక్టర్ కె.ఎల్.రావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలో నగరంలోని (విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ) మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో నందిగామ, తిరువూరు రిజర్వుడ్ స్థానాలు. 
2014 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కె.రాజేంద్రప్రసాద్‌పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని నాని 74,841 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952 హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ(స్వతంత్ర) 
* 1957 కె.అచ్చమాంబ(కాంగ్రెస్) 
* 1962 కె.ఎల్.రావు(కాంగ్రెస్) 
* 1967 కె.ఎల్.రావు(కాంగ్రెస్) 
* 1971 కె.ఎల్.రావు(కాంగ్రెస్) 
* 1977 గోడే మురహరి(కాంగ్రెస్) 
* 1980 చెన్నుపాటి విద్య(కాంగ్రెస్) (ఐ) 
* 1984 వడ్డే శోభనాద్రీశ్వరరావు (తెదేపా) 
* 1989 చెన్నుపాటి విద్య (కాంగ్రెస్)
* 1991 వడ్డే శోభనాద్రీశ్వరరావు తెదేపా 
* 1996 పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్)
* 1998 పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్)
* 1999 గద్దె రామ్మోహన్ (తెదేపా)
* 2004 లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్)
* 2009 లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్)
* 2014 కేశినేని నాని(తెదేపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net