close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం 

కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌కు రిజర్వ్‌ చేయబడి ఉంది. గతంలో జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాలు కూడా జిల్లాలో ఉండేవి. 1952లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం విభజన తర్వాత నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నంద్యాల, పాణ్యం, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, నందికొట్కూరు, ఆత్మకూరు, ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుతో ఏర్పడింది. 2009లో పునర్విభజనతో నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలతో కొత్తగా ఏర్పడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎస్పీవైరెడ్డి 1,08,634 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

నంద్యాలో లోక్‌సభ నుంచి గెలుపొందిన వారి వివరాలు 
1952- రాయసం శేషగిరిరావు(స్వతంత్ర)
1967- పెండేకంటి వెంకటసుబ్బయ్య(కాంగ్రెస్) 
1971- పెండేకంటి వెంకటసుబ్బయ్య(కాంగ్రెస్)
1977- నీలం సంజీవరెడ్డి జనతాపార్టీ 
1978- (ఉప ఎన్నిక) పెండేకంటి వెంకటసుబ్బయ్య(కాంగ్రెస్)
1980- పెండేకంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ (ఐ) 
1984- మద్దూరు సుబ్బారెడ్డి తెలుగుదేశం 
1989- బొజ్జా వెంకటరెడ్డి (కాంగ్రెస్)
1991- గంగుల ప్రతాపరెడ్డి (కాంగ్రెస్)
1991- (ఉప ఎన్నిక) పీవీ నరసింహరావు (కాంగ్రెస్)
1996- పీవీ నరసింహరావు (కాంగ్రెస్)
1996- (ఉప ఎన్నిక) భూమానాగిరెడ్డి తెలుగుదేశం 
1998- భూమా నాగిరెడ్డి తెలుగుదేశం 
1999- భూమానాగిరెడ్డి తెలుగుదేశం 
2004- ఎస్పీవై.రెడ్డి (కాంగ్రెస్)
2009- ఎస్పీవై రెడ్డి (కాంగ్రెస్)
2014- ఎస్పీవై రెడ్డి(వైకాపా)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net