close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం 

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలోనే ఉంది. కర్నూలు, కోడుమూరు(ఎస్సీ), ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 2009 పునర్విభజనలో వీటి సంఖ్యలో మార్పు లేకున్నా డోన్ స్థానంలో నూతనంగా అవిర్భవించిన మంత్రాలయం నియోజకవర్గం వచ్చి చేరింది.

1952లో  జరిగిన తొలిసారి ఎన్నికల్లో హెచ్.సీతారాంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. దివంగత కోట్ల విజయభాస్కరరెడ్డి ఆరుసార్లు గెలిచారు. ఆయన కూమారుడు, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి మూడుసార్లు విజయం సాధించారు. 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999 కేఈ కృష్ణమూర్తి తెదేపా అభ్యర్థులుగా రెండు పర్యాయాలు కోట్ల విజయభాస్కరరెడ్డి మీద గెలుపొందారు.

ఇప్పటివరకూ 16సార్లు జరిగి ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, తెలుగుదేశం రెండు స్లార్లు, స్వతంత్రులు ఒకసారి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి విజయం సాధించాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటీ నాయుడుపై వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక 45,224 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ఇప్పటివరకూ విజయం సాధించిన అభ్యర్థులు వీరే!
* 1952 హెచ్‌సీతారామిరెడ్డి కాంగ్రెస్ 
* 1957 ఉస్మాన్ అలీఖాన్ కాంగ్రెస్ 
* 1962 యశోదారెడ్డి కాంగ్రెస్ 
* 1967 గాదిలింగన్న గౌడ్ స్వత్రంత్ర 
* 1971 కోదండరామిరెడ్డి కాంగ్రెస్-జె 
* 1977 కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1980 కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1984 ఏరాసు అయ్యపురెడ్డి తెదేపా 
* 1989 కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1991 కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1994 కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1996 కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ 
* 1999 కేఈ క్రిష్ణమూర్తి తెదేపా 
* 2004 కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ 
* 2009 కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌
* 2014 బుట్టా రేణుక(వైకాపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net