close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం 

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. అప్పటి నియోజకవర్గ పరిధిలో నెల్లూరులోని రెండు శాసనసభ నియోజకవర్గాలు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలుండేవి. 1957 ఎన్నికల నాటికి నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ సాధారణ కేటగిరి నుంచి ఒక సభ్యుడు, ఎస్సీ కేటగిరీ నుంచి మరొక సభ్యుడు ప్రాతినిధ్యం వహించేందుకు వీలు కలిగింది. 1962లో కావలి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పూర్తిగా నెల్లూరు ఆనకట్టకు దక్షిణ భాగానికే పరిమితమైంది. 1971 తర్వాత కావలి పార్లమెంట్ స్థానం కనుమరుగైంది. 1977 ఎన్నికల నుంచి ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు, అల్లూరు, సర్వేపల్లి, రాపూరు, గూడూరు నియోజకవర్గాలతో నెల్లూరు నియోజకవర్గం కొనసాగింది. ఉదయగిరి, కావలి నియోజకవర్గాలు ఒంగోలు నియోజకవర్గంలో కలిశాయి. 1957 నుంచి 2004 ఎన్నికల వరకు ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో ఉంది. 2009 ఎన్నికల నుంచి జనరల్‌ కేటగిరికి 

2009 ఎన్నికల నాటికి జరిగిన పునర్విభజన జరిగిన తర్వాత రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు తిరుపతి లోక్‌సభ పరిధిలో కలిశాయి. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయగిరి, కావలి నియోజకవర్గాలతో పాటు ఒంగోలు జిల్లాలోని కందుకూరు శాసనసభా నియోజకవర్గాలు కలిశాయి. నెల్లూరు నియోజకవర్గం రెండు నియోజక వర్గాలుగా మారింది. కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. 

ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా,  12సార్లు కాంగ్రెస్‌ పార్టీ, రెండుసార్లు తెలుగుదేశం, రెండు సార్లు వైకాపాలు గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై వైకాపా అభ్యర్థి ఎం.రాజమోహన్‌రెడ్డి 13,478 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

నెల్లూరు లోక్‌సభ నుంచి విజేతలు 
1952 బెజవాడ రామచంద్రారెడ్డి (స్వతంత్ర) 
1957 బి.అంజనప్ప, ఆర్ఎల్ఎన్‌రెడ్డి (కాంగ్రెస్) 
1962 బి.అంజనప్ప (కాంగ్రెస్) 
1967 బి.అంజనప్ప (కాంగ్రెస్) 
1971 డి.కామాక్షయ్య (కాంగ్రెస్ 
1977 డి.కామాక్షయ్య (కాంగ్రెస్) 
1980 డి.కామాక్షయ్య (కాంగ్రెస్) 
1983 పి.పెంచలయ్య (తెలుగుదేశం) 
1984 పి.పెంచలయ్య (తెలుగుదేశం) 
1989 పి.పెంచలయ్య ( కాంగ్రెస్) 
1991 కె.పద్మశ్రీ (కాంగ్రెస్) 
1996 పనబాక లక్ష్మి (కాంగ్రెస్) 
1997 పనబాక లక్ష్మి (కాంగ్రెస్) 
1999 ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం) 
2004 పనబాక లక్ష్మి (కాంగ్రెస్) 
2009 మేకపాటి రాజమోహన్‌రెడ్డి (కాంగ్రెస్) 
2012 మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైకాపా)
2014 మేకపాటి రాజమోహన్‌రెడ్డి(వైకాపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net