close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం 

చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. దీన్ని ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1957లో ఇక్కడి నుంచి గెలుపొందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ లోక్‌సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కావడం గమనార్హం.  2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై తెలుగుదేశం అభ్యర్థి శివప్రసాద్‌ 44,138 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952: టి.ఎన్. విశ్వనాథ రెడ్డి-కాంగ్రెస్ 
* 1957: మాడభూషి అనంతశయనం అయ్యంగార్-కాంగ్రెస్ 
* 1962: ఎన్.జి.రంగా-స్వతంత్ర 
* 1967: ఎన్.పి. చెంగల్రాయుడు-కాంగ్రెస్ 
* 1971: పి.నరసింహారెడ్డి-కాంగ్రెస్ 
* 1977: పి.రాజగోపాల్ నాయుడు-కాంగ్రెస్ 
* 1980: పి.రాజగోపాల్ నాయుడు-కాంగ్రెస్ 
* 1984:ఎన్.పి. ఝాన్సీ లక్ష్మి-తెదేపా 
* 1989: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి-కాంగ్రెస్ 
* 1991: ఎమ్.జ్ఞానేంద్ర రెడ్డి-కాంగ్రెస్ 
* 1996: ఎన్.రామకృష్ణా రెడ్డి-తెదేపా 
* 1998: ఎన్.రామకృష్ణా రెడ్డి-తెదేపా 
* 1999: ఎన్.రామకృష్ణా రెడ్డి-తెదేపా 
* 2004: డి.కె.ఆదికేశవులు-తెదేపా 
* 2009: ఎన్.శివప్రసాద్-తెదేపా
* 2014: ఎన్‌.శివప్రసాద్‌(తెదేపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net