close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం 

నల్గొండ జిల్లాలో 1962లో ఏర్పడ్డ మిర్యాలగూడ నియోజక వర్గం 2009లో రద్దయింది. 2009లో భువనగిరి పార్లమెంటు కొత్తగా ఏర్పడింది. 
రిజర్వేషన్ : జనరల్ 
పరిధిలోకి వచ్చే జిల్లాలు : నల్గొండ, వరంగల్, రంగారెడ్డి 
అసెంబ్లీ నియోజకవర్గాలు : భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, జనగామ, ఇబ్రహీంపట్నం

2009లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ 30,532 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
తాజా ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి తెరాస తరపున బూర నర్సయ్యగౌడ్‌ మరోసారి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భాజపా నుంచి పడాల వెంకట శ్యామ్‌ సుందర్‌లు పోటీలో ఉన్నారు. 

 

గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు 
* 2009-2014 కె.రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
* 2014-2019 బూర నర్సయ్యగౌడ్‌(తెరాస)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net