close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకు ముందు  పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేవి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పశ్చిమ జిల్లాలోని 7 నియోజకవర్గాలతో చేవెళ్ల పార్లమెంటు స్థానం ఏర్పడింది. పట్టణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని మల్కాజ్‌గిరి లోక్‌సభ ఏర్పాటు చేశారు.
రిజర్వేషన్ : జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి
* కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల పార్లమెంటు స్థానం జనరల్‌కు కేటాయించడంతో మొదటిసారి కాంగ్రెస్ తరపున సూదిని జైపాల్‌రెడ్డి, తెదేపా నుంచి జితేందర్‌రెడ్డి, భాజపా నుంచి బద్ధం బాల్‌రెడ్డి పోటీ చేశారు. జైపాల్‌రెడ్డి 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది కేంద్ర మంత్రి వర్గంలో పట్టణాభివృద్ధిశాఖ, పెట్రోలియంశాఖ, సాంకేతికశాఖ మంత్రిగా పనిచేశారు.
* 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డిపై తెరాసకు చెందిన విశ్వేశ్వర్‌రెడ్డి 70,209 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో అధికార తెరాస నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కోసం కార్తీక్‌రెడ్డి పేరు బలంగా వినిపించినా చివరకు గులాబీ నాయకత్వం రంజిత్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. గత ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడంతో ఇప్పుడు హస్తంపై ఆయన బరిలో నిలిచారు. నియోజకవర్గ కో-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న బి.జనార్దన్‌రెడ్డికి భాజపా టికెట్‌ కేటాయించింది. 

గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు వీరే!
* 2009-2014 ఎస్‌.జైపాల్‌రెడ్డి(కాంగ్రెస్‌)
* 2014-2019 విశ్వేశ్వర్‌రెడ్డి(తెరాస)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net