close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సమాచారం 

ఆవిర్భావం : 1952లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. 
రిజర్వేషన్ : జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: ఖమ్మం పార్లమెంట్ స్థానం పూర్తిగా ఖమ్మం జిల్లాలోనే ఉంది. లోక్‌సభా స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం(జనరల్), వైరా(ఎస్టీ), మధిర(ఎస్సీ), కొత్తగూడెం(జనరల్), అశ్వారావుపేట(ఎస్టీ),  సత్తుపల్లి(ఎస్సీ), పాలేరు(జనరల్).
ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ నుంచి ఇద్దరు విజయం సాధించగా, పది సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, కమ్యూనిస్ట్‌పార్టీ, కాంగ్రెస్‌(ఐ), తెదేపా, వైకాపా అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 10,162 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

తాజా ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఇటీవల పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచి తెరాసలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ దక్కకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక కాంగ్రెస్‌ నుంచి రేణుకా చౌదరి బరిలో నిలిచారు. నామా, రేణుకల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2004, 2009 ఎన్నికల్లోనూ ప్రధాన ప్రత్యర్థులైన వీరిద్దరూ మళ్లీ 2019లో పోటీ పడటం గమనార్హం. భాజపా నుంచి వాసుదేవరావు పోటీ చేస్తుండగా, సీపీఎం తరపున బి.వెంకట్‌ పోటీలో ఉన్నారు. 

గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952-57- టి.బి.విఠల్ రావు(పి.డి.ఎఫ్)
* 1957-62- టి.బి.విఠల్ రావు(పి.డి.ఎఫ్)
* 1962-67- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
* 1967-71- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
* 1971-77- తేళ్ల లక్ష్మీకాంతమ్మ(కాంగ్రెస్‌)
* 1977-80- జలగం కొండలరావు(కాంగ్రెస్‌)
* 1980-84- జలగం కొండలరావుకాంగ్రెస్ (ఐ)
* 1984-89- జలగం వెంగళరావు(కాంగ్రెస్‌)
* 1989-91- జలగం వెంగళరావు(కాంగ్రెస్‌)
* 1991-96- పి.వి.రంగయ్య నాయుడు(కాంగ్రెస్‌)
* 1996-98- తమ్మినేని వీరభద్రం  భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్)
* 1998-99- నాదెండ్ల భాస్కరరావు(కాంగ్రెస్‌)
* 1999-04- రేణుకా చౌదరి(కాంగ్రెస్‌)
* 2004-2009- రేణుకా చౌదరి(కాంగ్రెస్‌)
* 2009-2014- నామా నాగేశ్వరరావు(తెదేపా)
* 2014-2019- పొంగులేటి శ్రీనివాసరెడ్డి(వైకాపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net