close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం 

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. 1952, 1957ల్లో ఇది ద్విసభ్య నియోజకవర్గం. అందులో ఒక సభ్యుడు జనరల్, మరొకరు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు ఉండేవారు. 
రిజర్వేషన్: జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గతంలో మెట్‌పల్లి, బుగ్గారం, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల, నేరేళ్ల, సిరిసిల్ల నియోజకవర్గాలుండేవి. 2009 పునర్విభజన తర్వాత హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గం పరిధి పూర్తిగా జిల్లాకే పరిమితమైంది.  2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై తెరాస అభ్యర్థి బి.వినోద్‌ 2,04,652 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో తెరాస నుంచి ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మరోసారి పొన్నం ప్రభాకర్‌ బరిలో నిలవగా, భాజపా నుంచి బండి సంజయ్‌ తొలిసారి ఎంపీ టికెట్‌ను దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన సంజయ్‌ రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1952 (ద్వి) బద్దం ఎల్లారెడ్డి పీడీఎఫ్, ఎం.ఆర్.కృష్ణ (ఎంసీఎఫ్)
* 1957 (ద్వి) ఎం.ఆర్.కృష్ణ, ఎం.శ్రీరంగారావు (కాంగ్రెస్)
* 1962 జె.రమాపతిరావు  (కాంగ్రెస్)
* 1967 జె.రమాపతిరావు  (కాంగ్రెస్)
* 1971 ఎం.సత్యనారాయణరావు తెలంగాణ ప్రజా సమితి 
* 1977 ఎం.సత్యనారాయణరావు  (కాంగ్రెస్)
* 1980 ఎం.సత్యనారాయణరావు (కాంగ్రెస్)
* 1984 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
* 1989 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
* 1991 జువ్వాడి చొక్కారావు  (కాంగ్రెస్)
* 1996 ఎల్.రమణ (తెదేపా)
* 1998 చెన్నమనేని విద్యాసాగర్‌రావు (భాజపా)
* 1999 చెన్నమనేని విద్యాసాగర్‌రావు (భాజపా)
* 2004 కె.చంద్రశేఖర్‌రావు (తెరాస)
* 2006 (ఉ.ఎ.)కె.చంద్రశేఖర్‌రావు (తెరాస)
* 2008 (ఉ.ఎ.) కె.చంద్రశేఖర్‌రావు (తెరాస)
* 2009 పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
* 2009 బి.వినోద్‌ (తెరాస)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net