close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

మహబూబాబాద్ లోక్‌సభ నియోజకర్గం 

నియోకవర్గాల పునర్విభజనతో వరంగల్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. 
రిజర్వేషన్: ఎస్టీ
అసెంబ్లీ నియోజకవర్గాలు: దీని పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఒక్కటే జనరల్ స్థానం. మిగిలిన ములుగు, మహబూబాబాద్, డోర్నకల్‌లతో పాటు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేసినవే. లోక్‌సభ నియోజకవర్గం మొత్తం (నర్సంపేట మినహా) పూర్తి ఏజన్సీ ప్రాంతమే. 
* నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లెందు ఖమ్మం లోక్‌సభ పరిధిలోనూ, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లు భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గంలో ఉండేవి. ఈ మూడింటిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లను కలిపి మహబూబాబాద్ లోక్‌సభ స్థానం కొత్తగా ఏర్పాటుచేశారు.

తాజా ఎన్నికల్లో అధికార తెరాస నుంచి డోర్నకల్‌ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ కుమార్తె ఎం.కవిత పోటీ చేయనున్నారు. సిట్టింగ్‌ ఎంపీ ఆచార్య సీతారాం నాయక్‌ను కాదని కవితకు టికెట్‌ ఇవ్వడం విశేషం. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేత బలరాం నాయక్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ మూడో స్థానంలో నిలిచిన హుస్సేన్‌ నాయక్‌ను భాజపా బరిలోకి దింపింది.

* 2009లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొరిక బలరాంనాయక్ గెలుపొంది.. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.
* 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌పై తెరాస అభ్యర్థి సీతారాం నాయక్‌ 35,653 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net