close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇందులో కలిశాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయడం విశేషం. 
2014లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డిపై తెరాస అభ్యర్థి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ 3,97,029 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే, గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసిన కేసీఆర్‌ అక్కడా విజయం సాధించడంతో మెదక్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 
రిజర్వేషన్: జనరల్ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: సిద్దిపేట, దుబ్బాక, మెదక్, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు.

తాజా ఎన్నికల్లో అధికార తెరాస నుంచి సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ గాలి అనిల్‌కుమార్‌కు టికెట్‌ కేటాయించింది. తెరాస ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొనసాగిన అనిల్‌కుమార్‌ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గ టికెట్‌ ఆశించినా దక్కలేదు. ఇప్పుడు మెదక్‌ ఎంపీగా కాంగ్రెస్‌ అవకాశం కల్పించింది. ఇక భాజపా నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగగా, పార్టీ అధినాయకత్వం రఘునందన్‌రావు పేరును ఖరారు చేసింది. 

ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు  
* 1952 :జయసూర్య (పి.డి.ఎఫ్.) 
* 1957 :పి.హనుమంతరావు (కాంగ్రెస్) 
* 1962 :పి.హనుమంతరావు (కాంగ్రెస్) 
* 1967 :సంగం లక్ష్మీబాయి (కాంగ్రెస్) 
* 1971 :మల్లికార్జున్ (టి.పి.ఎస్.) 
* 1977 :మల్లికార్జున్ (టి.పి.ఎస్.) 
* 1980 :ఇందిరా గాంధీ (కాంగ్రెస్) 
* 1984 :పి.మాణిక్యరెడ్డి (తెదేపా) 
* 1989 :ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్) 
* 1991 :ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్) 
* 1996 :ఎం.బాగారెడ్డి (కాంగ్రెస్) 
* 1998 :ఎం.బాగారెడ్డి (కాంగ్రెస)్ 
* 1999 :ఆలె నరేంద్ర (భాజపా) 
* 2004 :ఆలె నరేంద్ర (తెరాస) 
* 2009 :విజయశాంతి (తెరాస)
* 2014: కేసీఆర్‌(తెరాస), 
* 2014: కొత్త ప్రభాకర్‌రెడ్డి(తెరాస)(ఉప ఎన్నిక)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net