close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం 

దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గంగా పేరొందింది మల్కాజ్‌గిరి. భిన్న రాష్ట్రాల సంస్కృతులు, సామాజిక, రాజకీయ చైతన్యం గల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో(2014) అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 30 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ ఉండటం విశేషం. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లున్న(31.83 లక్షలు) నియోజకవర్గాల్లోనూ ఇదే మొదటి స్థానం.
అలా అవతరించి: గతంలో సిద్ధిపేట నియోజకవర్గంలో మల్కాజిగిరి ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మల్కాజిగిరి శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గం అవతరించాయి. ఎంపీ స్థానం పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్‌, మేడ్చల్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2009లో కాంగ్రెస్‌(సర్వే సత్యనారాయణ), 2014లో తెదేపా అభ్యర్థి(మల్లారెడ్డి) విజయం సాధించారు.

సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో ఈసారి తెరాస మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చింది. ఇక కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగడం విశేషం. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన రామచంద్రరావుకు భాజపా టికెట్‌ ఇవ్వగా, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నుంచి మహేందర్‌రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 2009: సర్వే సత్యనారాయణ(కాంగ్రెస్‌)
* 2014: మల్లారెడ్డి (తెదేపా)



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net