close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 

ఆవిర్భావం: నిజామాబాద్ లోక్‌సభ స్థానం 1952లో ఆవిర్భవించింది. 
రిజర్వేషన్: జనరల్ 
నిజామాబాద్‌లోకి బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల్ అసెంబ్లీ నియోజవకవర్గాలు వస్తాయి.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీపై తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత 1,63,893 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో తెరాస నుంచి సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మధుయాస్కీ గౌడ్‌ బరిలో ఉండగా, భాజపా ధర్మపురి అర్వింద్‌కు టికెట్‌ కేటాయించింది.

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు.. 
* 1952: హెచ్.సి. హెడ (కాంగ్రెస్) 
* 1957 :హెచ్.సి. హెడ (కాంగ్రెస్) 
* 1962 :హెచ్.సి హెడ (కాంగ్రెస్) 
* 1967 :ఎం.నారాయణరెడ్డి (స్వతంత్ర) 
* 1971 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1977 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1980 :ఎం.రాంగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1984 :టి.బాలాగౌడ్ (కాంగ్రెస్) 
* 1989 :టి.బాలాగౌడ్ (కాంగ్రెస్) 
* 1991 :గడ్డం గంగారెడ్డి (తెదేపా) 
* 1996 :ఆత్మచరణ్‌రెడ్డి (కాంగ్రెస్) 
* 1998 :గడ్డం గంగారెడ్డి (తెదేపా) 
* 1999 :గడ్డం గంగారెడ్డి (తెదేపా) 
* 2004 :మధుయాష్కిగౌడ్ (కాంగ్రెస్) 
* 2009 :మధుయాష్కిగౌడ్ (కాంగ్రెస్)
* 2014: కవిత(తెరాస)

 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net