close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం

ఆవిర్భావం: 1962లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఏర్పడింది. అంతకు ముందు కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేది. 
రిజర్వేషన్: ఎస్సీ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: 2004 ఎన్నికల వరకు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో పెద్దపల్లి, మేడారం, మంథని, హుజూరాబాద్, ఇందుర్తి, చెన్నూరు, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మార్పు చేశారు. ప్రస్తుతం పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలున్నాయి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జి.వివేకానందపై 2,89,773 ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి, బాల్క సుమన్‌ విజయం సాధించారు.

తాజా ఎన్నికల్లో తెరాస నుంచి బోర్లకుంట వెంకటేశ్‌ నేత పోటీ చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నూరును నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్‌ అక్కడ ఓడిపోయారు. ఇటీవల తెరాసలో చేరిన ఆయనకు ఎంపీ సీటు దక్కడం విశేషం. ఇక కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎ.చంద్రశేఖరరావు పోటీచేస్తుండగా, భాజపా నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత సోగా కుమార్‌ బరిలో ఉన్నారు. 

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1962: ఎం.ఆర్.కృష్ణ (కాంగ్రెస్) 
* 1967: ఎం.ఆర్.కృష్ణ (కాంగ్రెస్) 
* 1971: వి.తులసీరాం (టి.పి.ఎస్). 
* 1977: వి.తులసీరాం (కాంగ్రెస్) 
* 1980: కె.రాజమల్లు (కాంగ్రెస్(ఐ)) 
* 1983:గొట్టె భూపతి (తెదేపా) 
* 1984: గొట్టె భూపతి (తెదేపా) 
* 1989: జి.వెంకటస్వామి (కాంగ్రెస్) 
* 1991: జి.వెంకటస్వామి (కాంగ్రెస్) 
* 1996: జి.వెంకటస్వామి (కాంగ్రెస్) 
* 1998: కె.సుగుణాకుమారి (తెదేపా) 
* 1999: కె.సుగుణాకుమారి (తెదేపా)
* 2004: జి.వెంకటస్వామి (కాంగ్రెస్) 
* 2009: జి.వివేక్ (కాంగ్రెస్)
* 2014: బాల్క సుమన్‌(తెరాస)మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net