close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం 

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం 1962లోఏర్పడింది. 
రిజర్వేషన్: ఎస్సీ 
అసెంబ్లీ నియోజకవర్గాలు: నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు చెందిన మందా జగన్నాథం పై కాంగ్రెస్‌ అభ్యర్థి నంది ఎల్లయ్య 17,800 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

ప్రస్తుత ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ నుంచి పి.రాములు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి మల్లురవి, భాజపా నుంచి బంగారు శ్రుతి పోటీలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎంపీ మల్లు రవికి కాంగ్రెస్‌ మరోసారి అవకాశం ఇచ్చింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన జడ్చర్ల నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

ఇప్పటివరకు గెలుపొందిన అభ్యర్థులు వీరే!
* 1962 : జేబీ ముత్యాల్‌రావు (కాంగ్రెస్) 
* 1967 : జేబీ ముత్యాల్‌రావు (కాంగ్రెస్) 
* 1972 : భీష్మదేవ్ (తెలంగాణ ప్రజాసమితి) 
* 1977 : భీష్మదేవ్ (కాంగ్రెస్) 
* 1981 :మల్లు అనంతరాములు (కాంగ్రెస్) 
* 1983 : వి.తులసిరాం (తెదేపా) 
* 1984 : వి.తులసిరాం (తెదేపా) 
* 1989 : మల్లు అనంతరాములు (కాంగ్రెస్) 
* 1991 : మల్లు రవి (కాంగ్రెస్) 
* 1996 : మంద జగన్నాథ్ (తెదేపా) 
* 1998 : మల్లురవి (కాంగ్రెస్) 
* 1999 : మంద జగన్నాథ్ (తెదేపా) 
* 2004 : మంద జగన్నాథ్ (తెదేపా) 
* 2009 : మంద జగన్నాథ్ (కాంగ్రెస్)
* 2014: నంది ఎల్లయ్య(కాంగ్రెస్‌)



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net