close

తెలంగాణ లోక్‌సభా స్థానాలు

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. 

2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అంజన్‌కుమార్‌పై భాజపా అభ్యర్థి బండారు దత్తాత్రేయ 2,44,703 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

తాజా ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి తెరాస తరపున తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తనయుడు తలసాని సాయికిరణ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరపున అంజన్‌కుమార్‌ యాదవ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి భాజపా అగ్ర నాయకత్వం కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు విశ్రాంతినిచ్చి, ఆయన స్థానంలో ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డికి సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో సికింద్రాబాద్‌లో పోటీ రసవత్తరంగా మారింది. 

 

ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు-పార్టీలు 
* 1957: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్ 
* 1962: అహ్మద్ మొహిద్దీన్- కాంగ్రెస్ 
* 1967: బకర్ అలీమిర్జా-కాంగ్రెస్ 
* 1971: ఎమ్ఎమ్.హషీమ్-తెలంగాణ ప్రజా సమితి 
* 1977: ఎమ్ఎమ్.హషీమ్-కాంగ్రెస్ 
* 1980: పి. శివ్‌కుమార్-కాంగ్రెస్ 
* 1984: టి. అంజయ్య-కాంగ్రెస్ 
* 1989: టి. మణియమ్మ-కాంగ్రెస్ 
* 1991: బండారు దత్తాత్రేయ-భాజపా 
* 1996: పీవీ రాజేశ్వరరావు-కాంగ్రెస్ 
* 1998: బండారు దత్తాత్రేయ-భాజపా 
* 1999: బండారు దత్తాత్రేయ-భాజపా 
* 2004: ఎమ్.అంజన్‌కుమార్ యాదవ్-కాంగ్రెస్ 
* 2009: ఎమ్.అంజన్‌కుమార్ యాదవ్-కాంగ్రెస్
* 2014: బండారు దత్తాత్రేయ-భాజపా



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net