close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ సమాచారం 

అనంతపురం లోక్‌సభ నియోజక వర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్వల్ప మార్పలు చోటు చేసుకున్నాయి. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న రాప్తాడు మండలం, అనంతపురం రూరల్  మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమయ్యాయి. రెవెన్యూ డివిజన్ల పరిధిలో కలిపి మొత్తం 63 మండలాలు ఉన్నాయి. 
రిజర్వేషన్: జనరల్ 
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్, శింగనమల(ఎస్సీ) పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 12సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, తెలుగుదేశం మూడు సార్లు, కమ్యూనిస్ట్‌ పార్టీ ఒకసారి విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తెదేపా అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి 61,991ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

తాజా ఎన్నికల్లో తెదేపా తరపున జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి తలారి రంగయ్య బరిలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన అనంతపురం లోక్‌సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. దీంతో పార్టీ నుంచి డి.జగదేశ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి కుంచం రాజీవ్‌రెడ్డి నిలబడ్డారు.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు 
* 1952-57: పైడి లక్ష్మయ్య(కాంగ్రెస్)
* 1957-62: తరిమెల నాగిరెడ్డి(కమ్యూనిష్టు పార్టీ)
* 1962-67: ఉస్మాన్ అలీ ఖాన్(కాంగ్రెస్)
* 1967-71: పొన్నపాటి ఆంటోని రెడ్డి(కాంగ్రెస్)
* 1971-77: పొన్నపాటి ఆంటోని రెడ్డి(కాంగ్రెస్)
* 1977-80: దారుర్ పుల్లయ్య(కాంగ్రెస్)
* 1980-84: దారుర్ పుల్లయ్య(కాంగ్రెస్)
* 1984-89: డి.నారాయణ స్వామి(తెదేపా)
* 1989-91: అనంత వెంకట రెడ్డి(కాంగ్రెస్)
* 1991-96: అనంత వెంకట రెడ్డి(కాంగ్రెస్)
* 1996-98: అనంత వెంకట రామిరెడ్డి(కాంగ్రెస్)
* 1998-99: అనంత వెంకటరామిరెడ్డి(కాంగ్రెస్)
* 1999-04: కలవ శ్రీనివాసులు(తెదేపా)
* 2004-2009: అనంత వెంకటరామిరెడ్డి(కాంగ్రెస్)
* 2009-2014: అనంత వెంకటరామిరెడ్డి(కాంగ్రెస్)
* 2014-2019: జె. సి. దివాకర్ రెడ్డి(తెదేపా)


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net