close

ఆంధ్రప్రదేశ్‌-లోక్‌సభా స్థానాలు

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం 

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి. ఇక్కడి నుంచి ఈసారి ప్రధాన పార్టీల నుంచి జిల్లా వాసులే పోటీ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలపై గురిపెట్టిన ఆ నాయకులు ఇక్కడ భారీ మెజార్టీ సాధించడానికి దృష్టి సారిస్తున్నారు. తిరుపతి లోకసభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉండగా చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు ఉన్నాయి. 
ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 11సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, తెదేపా రెండుసార్లు, వైకాపా ఒకసారి విజయం సాధించాయి. 
2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు చెందిన వెలగపల్లి వరప్రసాదరావు భాజపా అభ్యర్థి జయరామ్‌పై 37,425 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ప్రస్తుతం తెదేపా నుంచి పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి బల్లె దుర్గా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌లు పోటీ చేస్తున్నారు. 

ఇప్పటివరకూ జరిగిన ఎన్నకల్లో గెలిచిన నేతలు వీరే! 
* 1952 మాడభూషి అనంతశయనం అయ్యంగార్(కాంగ్రెస్) 
1957 - 1962 సి. దాస్(కాంగ్రెస్) 
1967 సి. దాస్(కాంగ్రెస్) 
1971 టి. బాలక్రిష్ణయ్య(కాంగ్రెస్) 
1977 టి. బాలక్రిష్ణయ్య(కాంగ్రెస్) 
1980 పసల పెంచలయ్య(కాంగ్రెస్) 
1984 చింతా మోహన్(కాంగ్రెస్) 
1989 చింతా మోహన్(కాంగ్రెస్) 
1991 చింతా మోహన్(కాంగ్రెస్) 
1996 నేలవాల సుబ్రహ్మణ్యం(కాంగ్రెస్) 
1998 చింతా మోహన్(తెదేపా) 
1999 డా|| నందిపాకు వెంకటస్వామి(భాజపా) 
2004 చింతా మోహన్(కాంగ్రెస్) 
2009 చింతా మోహన్(కాంగ్రెస్)
2014 వర ప్రసాదరావు(వైకాపా)


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net