close

ఒకప్పటి ముచ్చట్లు

ప్రయాణం తెచ్చిపెట్టిన  టికెట్‌

నం ఎన్నో ప్రయాణాలు చేసినా.. కొన్ని మాత్రమే జీవితాంతం గుర్తుండిపోతాయి. కొన్ని జీవనగమనాన్నే మార్చేస్తాయి. అలాంటిదే కేంద్ర భారీపరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో జీవితంలోనూ జరిగింది. ఫిబ్రవరి 28, 2014న దిల్లీ నుంచి వస్తున్న విమానంలో బాబుల్‌, రాందేవ్‌ బాబాలవి పక్కపక్క సీట్లు. ఆ సమయంలో రాందేవ్‌బాబా భాజపా టికెట్ల విషయమై ఫోన్లో మంతనాలు సాగించారు. ఏం మాట్లాడుతున్నారని బాబుల్‌ అడిగారు. ‘‘ఎన్నికలు జరగనున్నాయి కదా! దేశానికి మంచినేతలు కావాలి. భాజపాకు మంచి అభ్యర్థులు అవసరం’’ అని బాబా బదులిచ్చారు. దీంతో ‘నేను మంచి వ్యక్తినే, నాకు టికెట్‌ ఇస్తారా?’ అని బాబుల్‌ అడగడం రాందేవ్‌ను ఆకర్షించింది. వెంటనే తన పీఏను పిలిచి బాబుల్‌ ఫోన్‌ నంబరు తీసుకోవాలని ఆదేశించారు. కొన్నిగంటల వ్యవధిలోనే (మార్చి ఒకటో తేదీన) సంఘ్‌ పరివార్‌ నేత నుంచి బాబుల్‌కు ఫోన్‌ వచ్చింది. ఎన్నికల్లో పోటీచేస్తారా అని ప్రశ్నించడంతో ఏమీ అర్థం కాలేదు. చర్చల తర్వాత భాజపా అధిష్ఠానం.. పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ టికెట్‌ను బాబుల్‌ సుప్రియోకు ఖరారు చేసింది. ఆ ఎన్నికల్లో బాబుల్‌ గెలవడం, తర్వాత కేంద్ర సహాయమంత్రి పదవి చేపట్టడం తెలిసిందే.


మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net