close

తాజా వార్తలు

ఇంతటి బలహీన ప్రధానిని ఇంతవరకు చూడలేదు

జాతీయవాదం పేరిట అణగదొక్కుతున్నారు
భాజపా, మోదీపై విరుచుకుపడిన ప్రియాంకాగాంధీ

పుల్‌పల్లి, మనంతవాడి: ఇలాంటి బలహీన ప్రభుత్వాన్ని, ప్రధానిని ఇంతవరకు చూడలేదని భాజపాను, మోదీని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శించినవారిని అణగదొక్కడమే జాతీయవాదమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న వయనాడ్‌లోని పుల్‌పల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె రైతులనుద్దేశించి ప్రసంగించారు. తమ సమస్యలు తీర్చాలంటూ దిల్లీకి నడిచివచ్చిన వేలాదిమంది రైతుల బాధ వినకపోవడం ఏం జాతీయవాదమని ఆమె ప్రశ్నించారు. తనిచ్చిన హామీలను తనే తేలిగ్గా కొట్టిపారేసే ప్రధాని కంటే, ప్రజలను గౌరవించే ఇంతకంటే గొప్పవ్యక్తి అవసరం అన్నారు. మీకోసం మాట్లాడే ప్రభుత్వం రావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మిమ్మల్ని ప్రోత్సహించే ప్రభుత్వంతో మీకు ఉపయోగం ఉంటుందన్నారు. మీకు వ్యతిరేకంగా, మీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని కొడుతున్నారని, జైలపాల్జేస్తున్నారని.. ఇదేనా జాతీయవాదం? అని మోదీని ఉద్దేశించి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net